
కొందరు రాత్రి పూట తలస్నానం చేసి, జుట్టు తడిగా ఉండగానే నిద్రపోతుంటారు. అయితే దీనివల్ల సౌందర్యపరంగా పలు సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఇలా జరగక్కూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. ⚛ వీలు కుదుర్చుకొని ఉదయాన్నే తలస్నానం చేయడం మంచిది.
తద్వారా రాత్రి పడుకునే సమయానికి కేశాలు సహజసిద్ధంగా ఆరిపోతాయి. కాబట్టి హెయిర్ డ్రయర్స్ ఉపయోగించే అవసరం ఉండదు. తద్వారా జుట్టు డ్యామేజ్ కాకుండానూ కాపాడుకోవచ్చు. ⚛ తలస్నానం చేశాక కాటన్ టీ-షర్ట్ లేదంటే కాటన్ టవల్‌తో జుట్టును పొడిగా తుడుచుకోవాలి.
కాటన్ వస్త్రం వెంట్రుకల్లోని తేమను సులభంగా పీల్చేసుకుంటుంది. తద్వారా జుట్టు త్వరగా ఆరిపోతుంది. ⚛ వెంట్రుకలు దృఢత్వాన్ని కోల్పోకూడదంటే తలస్నానం చేశాక కండిషనర్ రాసుకోవడం మర్చిపోవద్దంటున్నారు నిపుణులు. ⚛ ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పడుకునే ముందే తలస్నానం చేయాల్సి వస్తే సిల్క్ దిండు కవర్‌ను ఉపయోగించమంటున్నారు నిపుణులు.
తద్వారా దిండుకు, వెంట్రుకలకు మధ్య రాపిడి తక్కువగా జరిగి జుట్టు డ్యామేజ్ కాకుండా కొంతవరకు రక్షించుకోవచ్చంటున్నారు. ⚛ రాత్రుళ్లు జుట్టు ఆరబెట్టుకునే సమయం లేని వారు తక్కువ వేడితో బ్లో-డ్రయర్స్ ఉపయోగించి వెంట్రుకల్ని ఆరబెట్టుకుంటే జుట్టు మరీ ఎక్కువగా డ్యామేజ్ కాకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు నిపుణులు.
⚛ దిండు కవర్లను ఎప్పటికప్పుడు మార్చడం వల్ల కూడా వాటిపై చేరిన బ్యాక్టీరియా ఫంగస్ల నుంచి కుదుళ్లను, ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు