
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్‌లో భేటీ అవుతారని వైట్‌హౌస్ ప్రకటించింది. జూన్ 15-17 వరకు ఫ్రాన్స్‌లోని ఎవియన్ లే బైన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. భాగస్వామ్య దేశంగా భారత్‌కు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. ఇక్కడే ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. చివరిగా 2025 ఫిబ్రవరిలో అమెరికా పర్యటన నేపథ్యంలో మోదీ- ట్రంప్ భేటీ అయ్యారు. మోదీ, ట్రంప్ భేటీ ఫిక్స్
|