
సంగీత దర్శకుడు రమణ గోగులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. సంగీత దర్శకుడు రమణ గోగులకు (Ramana Gogula) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan). ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేశారు. ‘నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. ఆ గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్ పూర్ లో ఎం.టెక్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యావంతుడు రమణ గోగుల ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు
.