
భారతీయ వంటగదిలో కరివేపాకు లేని తాలింపును ఊహించడం కష్టం. కూరకు చక్కటి సువాసన, రుచిని అందించే కరివేపాకును చాలామంది భోజనం చేసేటప్పుడు ఏరి పక్కన పెట్టేస్తుంటారు. అయితే, అలా తీసిపారేసే ఆకుల్లోనే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కేవలం ఓ సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, మన పెరట్లోని ఓ శక్తివంతమైన ఔషధ గని అని వారు వివరిస్తున్నారు.కరివేపాకును 'యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్' అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్లు, కార్బజోల్ ఆల్కలాయిడ్లు వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని నివారిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ కారణంగానే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం, దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కరివేపాకును రోజూ తీసుకోవడం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ప్రభావం తగ్గి, శరీరం అంతర్గతంగా బలోపేతం అవుతుంది.జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కరివేపాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేసి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో కరివేపాకును భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.కరివేపాకులో సమృద్ధిగా ఉండే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. అదేవిధంగా, విటమిన్ ఏ కంటి