పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 ఎక్కువగా లభిస్తుంది. అందుకే విటమిన్ బి12 లోపం రాకుండా ఉండాలంటే ఈ పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది. ఫోర్టిఫైడ్ చేసిన సోయా పాలు తాగడం అలవాటు చేసుకుంటే కావాల్సినంత విటమిన్ బి12 లభిస్తుంది. అందుకే ఫోర్టిఫైడ్ సోయా పాలు తాగడం చాలా మంచిది. విటమిన్ బి12 కావాలనుకునే వారు మార్కెట్లో దొరికే న్యూట్రిషనల్ ఈస్ట్ కూడా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ విటమిన్ బి12 లోపం రాకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. పాలతో తయారుచేసే పనీర్‌లోనూ విటమిన్ బి12 లభిస్తుంది. శాకాహారులు ఈ పనీర్ తీసుకోవడం ద్వారా తగినంత విటమిన్ బి12ని పొందవచ్చు. ఫోర్టిఫైడ్ చేసిన బాదం పాలు తాగడం ద్వారా విటమిన్ బి12 పొందవచ్చు. వెజ్ తినేవారు విటమిన్ బి12 లోపం తగ్గించేందుకు ఈ బాదం పాలు తీసుకోవచ్చు. సోయాతో తయారుచేసే టెంపేలో కూడా కావాల్సినంత విటమిన్ బి12 లభిస్తుంది. ముఖ్యంగా ఫోర్టిఫైడ్ చేసిన టెంపే తింటే చాలా మంచిది స్విస్ చీజ్‌లోనూ సరిపడా విటమిన్ బి12 లభిస్తుంది. శాకాహారులు విటమిన్ బి12 కోసం స్విస్ చీజ్‌ను డైట్లో చేర్చుకోవడం మంచిది. కోడిగుడ్లలోనూ మీకు కావాల్సినంత విటమిన్ బి12 ఉంటుంది. రెగ్యులర్‌గా కోడిగుడ్లు తినడం ద్వారా తగినంత విటమిన్ బి12 పొందవచ్చు. నోరి అనేది నాచు లాంటి పదార్థంతో తయారుచేసే వంటకం. దీనిని మీ డైట్లో చేర్చుకుంటే కావాల్సినంత విటమిన్ బి12ని పొందవచ్చు
.