
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్‌డౌన్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్‌కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు. భారత తుదిజట్టు శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. అఫ్గనిస్తాన్ తుదిజట్టు ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్
Jun 13 2026 5:19 PM | Updated on Jun 13 2026 5:40 PM
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.
అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు.
కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్‌డౌన్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్‌కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.
భారత తుదిజట్టు శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
అఫ్గనిస్తాన్ తుదిజట్టు ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.
పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు)
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)
'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు)
చేతకానప్పుడు సీఎం అవ్వడం ఎందుకు? బాబుపై మహిళ ఫైర్
కుక్క మృతి.. అసలు దానికి ఏమైందంటే? ట్విస్ట్..