
ఇంటర్నెట్ డెస్క్: భారత్, అఫ్గాన్ మధ్య తొలి వన్డే మ్యాచ్‌కు ధర్మశాల వేదిక. టాస్ గెలిచిన టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున గూర్నూర్ బ్రార్, హర్ష్ దూబె అరంగేట్రం చేశారు. భారత్ తుది జట్టు ఇదే: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. అఫ్గానిస్థాన్ తుది జట్టు ఇదే: ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఘజన్ఫర్, జియావుర్ రెహ్మాన్. క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి వన్డేకు అంతరాయం కలిగించిన వరుణుడు శాంతించాడు. వర్షం ఆగిపోవడంతో మైదానాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరికాసేపట్లో టాస్ వేస్తారు. ఆట సాయంత్రం 5.45 గంటలకు మొదలవుతుంది. వర్షం కారణంగా సమయం వృథా కావడంతో.. మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా తొలి సిరీస్‌ను ఆడబోతోంది. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు ధర్మశాల వేదిక. అయితే, అక్కడ వర్షం పడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఒంటిగంటకు టాస్ పడాలి. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆట ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా ఇప్పటికీ టాస్ వేయలేదు. మరోవైపు ఓవర్లలో కోత పడే సమయం కూడా మొదలైంది. కనీసం 20 ఓవర్ల గేమ్ జరగాలంటే.. మ్యాచ్ సాయంత్రం 6.32 గంటలకు ప్రారంభం కావాలి. ఆలోగా వర్షం ఆగి.. మైదానాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ టీమ్ఇండియాకు కీలకమే. ఎందుకంటే స్టార్
బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడా..? అప్పటివరకు అతడు ఫిట్నెస్ కొనసాగించగలడా..? జోరుమీదున్న కుర్రాళ్లతో పోటీపడి పరుగులు సాధించగలడా? తరచుగా గాయపడుతున్న హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్న నితీశ్ కుమార్ రెడ్డి వన్డే జట్టులో చోటు ఖాయం చేసుకుంటాడా? వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ముందు భారత జట్టు దాదాపుగా 25 వన్డేలే ఆడనున్న నేపథ్యంలో సెలక్టర్లు ఈ ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానం వెతకాల్సిందే. ఇప్పుడీ సిరీస్‌లో రాణించడం ఆ ఆటగాళ్లకు ఎంతో కీలకం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.