ఇంట్లో వాడకుండా పడేసిన పాత స్మార్ట్‌ఫోన్‌తో మళ్లీ ఉపయోగం ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ అదే ఫోన్ భవిష్యత్తులో డేటా సెంటర్లో భాగం కావొచ్చు. పాత స్మార్ట్ఫోన్లను కొత్త సర్వర్లలా ఉపయోగించే వినూత్న ప్రాజెక్టుపై గూగుల్ పని చేస్తోంది. ఈ ఆలోచన విజయవంతమైతే వేల సంఖ్యలో పాత ఫోన్లతో చిన్న డేటా సెంటర్లు నిర్మించే అవకాశం ఉంది.సాధారణంగా పాత ఫోన్లలో ఉండే ప్రాసెసర్, మెమరీ, స్టోరేజ్ వంటి భాగాలు ఇంకా పనిచేసే స్థితిలోనే ఉంటాయి. ఈ సామర్థ్యాన్ని వినియోగించాలని గూగుల్ భావిస్తోంది. అందుకే పాత ఫోన్ల హార్డ్‌వేర్‌ను మళ్లీ ఉపయోగించే మార్గాలపై పరిశోధనలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాండియాగో పరిశోధకులతో కలిసి గూగుల్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతోంది. ఈ ప్రణాళిక ప్రకారం దాదాపు 2,000 పాత పిక్సెల్ ఫోన్లతో ఒక కంప్యూటింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఒక చిన్న డేటా సెంటర్లా పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.పాత ఫోన్లోని స్క్రీన్, కెమెరా, బ్యాటరీ, బాడీ వంటి అవసరం లేని భాగాలను తొలగిస్తారు. తర్వాత ప్రాసెసర్, మెమరీ, స్టోరేజ్ ఉన్న మదర్‌బోర్డును మాత్రమే ఉంచుతారు. అలాంటి వందలాది లేదా వేల మదర్‌బోర్డులను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. వాటిలో లైనక్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసి కంప్యూటింగ్ వ్యవస్థగా మార్చుతారు.గూగుల్ అంచనా ప్రకారం 25 నుంచి 50 స్మార్ట్ఫోన్లతో ఏర్పడిన క్లస్టర్ కొన్ని పనుల్లో ఆధునిక సర్వర్ స్థాయి పనితీరు అందించగలదు. అలాంటి వందల ఫోన్లను కలిపితే మరింత పెద్ద స్థాయిలో సేవలు అందించే అవకాశం