
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-మండీ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ విద్యాలయంలో పునర్జన్మ, జ్యోతిష్యం వంటి అంశాలపై సదస్సు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నకిలీ సైన్స్‌ను ప్రోత్సహించడమేనని మండిపడ్డారు. ఐఐటీ-మండీ డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర విద్యాశాఖకు ఒక బహిరంగ లేఖ రాశారు. "పునర్జన్మ, జ్యోతిష్యం వంటి నకిలీ సైన్స్‌ను తిరస్కరించండి" అనే శీర్షికతో ఈ లేఖను విడుదల చేశారు.ఐఐటీ-మండీలోని 'ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ మెంటల్ హెల్త్ అప్లికేషన్స్ (IKSMHA)' సెంటర్ ఆధ్వర్యంలో జూన్ 3 నుంచి 6 వరకు 'మైండ్, బ్రెయిన్ అండ్ కాన్షియస్నెస్ కాన్ఫరెన్స్ 2026' జరిగింది. ఈ సదస్సులో పునర్జన్మ, శరీరం నుంచి ఆత్మ బయటకు రావడం (అవుట్-ఆఫ్-బాడీ ఎక్స్పీరియన్సెస్), మరణానికి దగ్గరగా వెళ్లిన అనుభవాలు, మరణానంతర సంభాషణలు వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. కొందరు విద్యార్థులు, ఫ్యాకల్టీ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడంతో వివాదం మరింత ముదిరింది.ఈ అంశాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, మతపరమైన సంస్థలతో సంబంధం ఉన్న కొందరు వక్తలుగా పాల్గొన్నారని శాస్త్రవేత్తలు తమ లేఖలో ఆరోపించారు. జ్యోతిష్యం కూడా నిరాధారమైనదని, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాల్లో జ్యోతిష్కుల అంచనాలు యాదృచ్ఛికం కంటే మెరుగ్గా లేవని తేలిందని వారు స్పష్టం చేశారు. ఐఐటీ-మండీ డైరెక్టర్‌తో పాటు ఐఐటీ-కాన్పూర్ ప్రొఫెసర్ కూడా ఒక సెషన్‌కు అధ్యక్షత వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.భారతీయ విజ్ఞాన