
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Union Cabinet Extension: పన్నెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి విశేష ప్రాధాన్యం లభిస్తుండగా.. తొలిసారిగా జనసేన పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్టీ పెట్టిన పుష్కర కాలానికి జనసేన కేంద్ర పదవులను అలంకరించనుంది. టీడీపీ.. జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి మరోసారి ప్రాధాన్యం లభిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొందరికి ఉద్వాసన పలకడంతో మరికొందరికి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర మంత్రివర్గంలోకి టీడీపీతోపాటు జనసేనకు కూడా అవకాశం లభిస్తుందని తెలుస్తోంది.
ఇటీవల జనసేన పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన లింగమనేని రమేష్ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు చర్చకు వస్తోంది.
నెల్లూరు లోక్‌సభ సభ్యుడు వేమిరెడ్డి కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అతడి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తుండడంతోపాటు పార్లమెంటులో చురుకైన పాత్ర, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో వేమిరెడ్డికి ఈసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో మరింత ప్రాతినిధ్యం కల్పిస్తారనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమతుల్యత, మిత్రపక్షాల ప్రాధాన్యత, రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర నాయకత్వం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతానికి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీని విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితేనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా లింగమనేని రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగతుందనేది కాలం సమాధానం ఇస్తుంది.
ఆయనకు కేంద్రంలో బాధ్యతలు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్