
సిడ్నీ: ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న భారత స్టార్ షట్లర్ పి.వి. సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్లో టాప్ సీడ్ యమగుచి (జపాన్) చేతిలో సింధు ఓటమిపాలైంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన మయగుచి చేతిలో 22-20, 21-12 తేడాతో భారత స్టార్ షట్లర్ పరాజయం చవిచూసి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో చాలాసేపు సింధు ఆధిక్యంలో నిలిచింది. కానీ, యమగుచి పట్టువదలకుండా పోరాడటంతో 20-20తో స్కోరు సమం అయింది. ఆ తర్వాత యమగుచి వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి జోరు కొనసాగించి సునాయసంగా విజయం సాధించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.