
బాలీవుడ్లో సక్సెస్ అయిన 8 వారాల ఓటీటీ విండో రూల్.. టాలీవుడ్లో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు..? అక్కడ 50 రోజుల తర్వాత ఓటిటిలో విడుదలవుతున్న సినిమా.. ఇక్కడెందుకు 30 రోజుల్లోపే వచ్చేస్తుంది..? అసలు ఈ 8 వారాల లెక్కల వెనుకున్న బిజినెస్ సీక్రెట్స్ ఏంటి..?
డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వందల కోట్ల డీల్స్ వెనక మ్యాటర్ ఏంటో చూద్దాం పదండి.. బాలీవుడ్లో ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది.. ఈ రూల్ బ్రేక్ చేస్తే మల్టీప్లెక్స్ వాళ్లు స్క్రీన్స్ ఇవ్వరు. పైగా వాళ్ల చేతుల్లోనే 60 నుంచి 75 శాతం థియెట్రికల్ రెవెన్యూ ఉంటుంది కాబట్టి ఎదురుండదు.
నార్త్‌లో ఎగ్జిబిటర్లు వేరు.. నిర్మాతలు వేరు కావడంతో 8 వారాల రూల్‌ను మల్టీప్లెక్స్‌లు స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నాయి. కాబట్టే ధురంధర్ లాంటి సినిమాలకు లాంగ్ రన్ సాధ్యమైంది. టాలీవుడ్‌కి వచ్చేసరికి సీన్ రివర్స్.. ఇక్కడ ఏషియన్ సినిమాస్, SVC, UV సెల్యులాయిడ్, మైత్రీ లాంటి వాళ్ళే ఎగ్జిబిటర్స్ కమ్ నిర్మాతలుగా ఉన్నారు.
ఒకవేళ 8 వారాల రూల్ పెడితే.. ఓటీటీ నుంచి నిర్మాతగా తమకు వచ్చే భారీ ఆదాయాన్ని వాళ్లే స్వయంగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకే తమకు తామే నష్టం చేసుకునే ఈ 8 వారాల డీల్‌పై పొత్తు కుదరట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్.. ఓ పెద్ద సినిమాకు 4 వారాల విండో అయితే 100 కోట్ల ఆఫర్ ఇచ్చే ఓటిటి సంస్థలు..
8 వారాలకు మార్చితే ఆ రేటును సగానికి తగ్గిస్తారు. సినిమా హిట్టైతే ఓకే కానీ ఫ్లాపైతే నిర్మాతలకు 50 కోట్లు నష్టమేగా..! ఈ రిస్క్ తీసుకోలేకే మన ఎగ్జిబిటర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పైగా బాలీవుడ్లో ఫ్లెక్సీ టికెట్ రేట్లుంటే..
మన దగ్గర భారీగా పెంచేస్తుంటారు. పైరసీ విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో.. 8 వారాల పాటు ఫుట్ ఫాల్స్ ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఈ
రిస్క్ అంతా ఎందుకనే సేఫ్‌గా 4 వారాల విండోకే ఓటేస్తున్నారు మన నిర్మాతలు. నార్త్‌లో సక్సెస్ అయిన ఈ ఓటీటీ ఫార్ములా.. టాలీవుడ్ బిజినెస్ మోడల్‌కు సెట్టవ్వట్లేదు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టే తెలుగులో ఎంత పెద్ద సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తుంది.
నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!
ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్కు..
Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది
Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న
Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?