మీనాక్షికి శిక్ష పడకుండా కోర్టులో సాక్ష్యం చెప్తామని చెప్పిన సుబ్బారావు.. చివర్లో హ్యాండ్ ఇవ్వడంతో మీనాక్షి జైలు పాలైంది నిన్నటి ఎపిసోడ్లో. ఇక ఈరోజు (జూన్ 13) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ఓ పక్క మీనాక్షి జీవితం జైల్లోనే సమాధి కావాలని కుట్రలు చేస్తున్న పల్లవి..
పైకి మాత్రం భరత్‌ని నమ్మించడానికి ఆమెపై దొంగ ప్రేమ నటిస్తుంది. భరత్ ముందు జైలర్‌కి ఫోన్ చేసి.. మీనాక్షికి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాలని.. ఆమెకి జైల్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని తెగ నటిస్తుంటుంది. చూశావా భరత్.. ‘మీ అమ్మ గురించి నేను ఎంత కేరింగ్ తీసుకుంటున్నానో చూశావా..
నువ్వు మీ అమ్మ గురించి టెన్షన్ పడొద్దు.. నేను చూసుకుంటా.. అవనిని జైలుకి పంపించడంతోనే మా అమ్మ ఆత్మశాంతిస్తుంది. మీ అమ్మకి తప్పకుండా రిలీజ్ చేయిస్తాను.. దానికి కొంచెం టైమ్ పడుతుంది.. ఓపికపట్టు అని అంటుంది పల్లవి. దాంతో భరత్..
‘థాంక్యూ సిస్టర్.. మీ అమ్మ గురించి ఇంత ఆలోచిస్తావ్’ అని అనుకోలేదు అని అంటాడు భరత్. కట్ చేస్తే.. అవని జైల్లో ఉన్న మీనాక్షిని కలుస్తుంది. తల్లిని చూడగానే తల్లడిల్లిపోతుంది అవని.నిన్ను జైలు నుంచి విడిపిస్తాను.. నువ్వేం బాధపడొద్దమ్మా..
నిన్ను తప్పకుండా రిలీజ్ చేయిస్తాను. నేరం చేసింది నువ్వు కాదని నిరూపిస్తాను.. నీకేం కాదు.. ధైర్యంగా ఉండు’ అని అంటుంది అవని. సర్లే అవనీ.. నా జీవితం ఇంతే అనుకున్నా.. నేను పోతేనైనా ఆ పల్లవికి నీపై కోపం తగ్గుతుందేమో.. నాకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకు వదిలెయ్ అని అంటుంది మీనాక్షి.
‘ఏంటమ్మా ఇదీ.. కూతుర్ని కాపాడటం కోసం నేరం నీపై వేసుకున్నావ్.. ఆ పల్లవి ఏం చేసినా సరే.. నిన్ను నిర్దోషిగా బయటకు నేను తీసుకొస్తాను’ అంటూ పాడినపాటే మళ్లీ పాడుతుంది అవని. అవసరం అయితే నీకోసం నా ప్రాణం ఇస్తానమ్మా.. నా తల్లి రుణం తీర్చుకుంటాను’ అని ఎమోషనల్ అవుతుంది అవని
. ఇక అమ్మకి టాటా బైబై చెప్పేసి వెళ్లపోతుంది అవని. ఒడియమ్మా మళ్లీ ఇదేం ట్విస్టూ.. ఇక జైల్లో మీనాక్షి ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. గట్టిగా దగ్గేసరికి నోట్లో నుంచి రక్తం బయటకు వస్తుంది. అది చూసి షాక్ అయిపోతుంది అవని. ఇక రాత్రి అయ్యేసరికి అవని, అక్షయ్‌లు ముచ్చట్లు పెట్టుకుంటారు. మా అమ్మని విడిపిస్తానని మాట ఇచ్చి వచ్చాను కానీ.. దారి కనిపించడం లేదు అని బాధపడుతుంది అవని. బర్త్ డే ఫంక్షన్లో అందరి ముందు మా అమ్మే పల్లవి కన్నతల్లి అని చెప్పమని నాన్న చెప్పారు. కానీ నేను ఆ నిజం చెప్పేలోపే పిన్ని చచ్చింది.. అమ్మ జైలు పాలైంది. ఆ నిజం బయటపెట్టి ఉంటే.. కనీసం అమ్మ అని పల్లవి కనికరించేదేమో. సాక్ష్యుల్ని పల్లవే దాచిపెట్టింది.. ఇప్పుడు ఆ నిజం చెప్తే.. నా తల్లిని విడిపించుకోవడానికి నేను మరో నాటకం ఆడుతున్నానే అనుకుంటుంది తప్ప అస్సలు నమ్మదు.. దిక్కులోని వాళ్లకి దేవుడే దిక్కు అంటారు.. ఆ దేవుడు కూడా నాకు ఏ దారీ చూపించడం లేదు. అమ్మని రిలీజ్ చేయించకపోతే నా బతుకు ఎందుకండీ అని బాధపడుతుంది అవని. ‘ధైర్యంగా ఉండు అవని.. నీకు తోడుగా నేను ఉన్నాను.. నీకోసం ఏమైనా చేస్తాను.. నేనున్నాని ధైర్యంగా ఉండు. ముందు ఆ సాక్ష్యుల్ని ఎక్కడున్నారో వెతికిపట్టుకుంటే.. మీ అమ్మని విడిపించొచ్చు. ఖచ్చితంగా వాళ్లని పల్లవే దాచిపెట్టి ఉంటుంది. వెతికిపట్టుకుందాం.. మీ అమ్మని విడిపిద్దాం’ అని అంటాడు అక్షయ్. మా అమ్మ జైల్లో ఉన్నా మీ అమ్మ దినం చేయడానికి వచ్చా.. అది నా బాధ్యత.. ‘ఒడియమ్మా అవనో’ అటు పల్లవితో వాయించుకున్న వాయింపు సరిపోక మళ్లీ రాత్రి పూట పల్లవి దగ్గరకు వెళ్తుంది అవని. మొన్న శపథాలు చేశావ్.. తెగ బిల్డప్‌లు కొట్టావ్.. ఏమైంది అంటూ ఇచ్చి పడేస్తుంది పల్లవి. మీ అమ్మని జైల్లో పెట్టారని ఏడుస్తూ కూర్చుంటావ్ అనుకుంటే.. ఇలా వచ్చావ్ ఏంటీ? మీ అమ్మ జైలుకి వెళ్లినా కూడా ఇంత గట్టగా ఉన్నావంటే.. గట్టి గుండే నీది? అని అంటుంది పల్లవి. ‘నీకు బాధ్యతలు లేవు.. నాకు అలా కాదు కదా.. సర్వం బాధ్యతలే.. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎలా పరిష్కరించాలనే అనుకుంటా. అందుకే పిన్నికి జరగాల్సిన కార్యాన్ని పూర్తి చేయడానికే వచ్చాను. బాధలు ఉన్నాయని బాధ్యతల్ని వదిలేయడం నాకు చేతకాదు’ అని అంటుంది అవని. సాక్ష్యుల్ని దాచిపెట్టింది నువ్వేనని తెలుసు.. ఇక కమల్ వచ్చి.. ఎప్పటిలాగే వదినకు డబ్బా కొడుతూ.. పెళ్లాన్ని మాటలతో కుళ్లపొడుస్తుంటాడు. ఇక అక్షయ్ వచ్చి పల్లవిని నిలదీస్తాడు. ఏంటి ఇలా వచ్చావ్ అని పల్లవి అంటే.. ‘ఎవరికీ తెలియకూడని పనులు చేసేది నువ్వు.. నీ విషయాలు నాకు తెలియదని అనుకుంటున్నావా? సాక్ష్యం చెప్పేవాళ్లని కోర్టుకి రాకుండా చేసింది నువ్వేనని నాకు తెలుసు’ అని అంటాడు అక్షయ్. ‘నాకంత అవసరం లేదు కానీ.. గతం మర్చిపోకు.. గతంలో నువ్వూ మీ ఆవిడ కలిసి మా డాడ్పై కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. మీరు కేసు పెడితే తప్పు కానప్పుడు మా అమ్మని చంపేసిన వాళ్లపై నేను కేసు పెడితే తప్పా? అని అంటుంది పల్లవి. నీకంటే అవనే గొప్పది.. ‘రేయ్ కొత్తగా చెప్పరా’.. అత్త అని చూడకుండా మీరు మా మామ్‌ని దూరం పెట్టి ఉండొచ్చు కానీ.. ఆమె చావుకి కారణం అయిన నీ పెళ్లాన్ని మాత్రం వదిలిపెట్టను. కూతురు రక్షించుకోవడం కోసం.. చేయని నేరాన్ని తనపై వేసుకుని జైలుకి వెళ్లడం తప్పుకానప్పుడు.. నా తల్లి కోసం నేను చేసేది తప్పెలా అవుతుంది? దీనికి సమాధానం ఉందా? అని అంటుంది పల్లవి. ‘అర్థం లేని అహంకారంతో రెచ్చిపోతున్న నీకు బంధాలు, బంధుత్వాలు తెలియడం లేదు.. నీతో మాట్లాడటం అనవసరం కానీ.. ఒక్కటి గుర్తుపెట్టుకో.. నువ్వు అవనితో పోటీ పడగలవేమో కానీ.. గెలవలేవ్. నీకు బుద్ధి చెప్పగలిగేది అవని మాత్రమేనని గుర్తుపెట్టుకో’ అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు అక్షయ్. ఇక రాజేశ్వరి దినకర్మలు భరత్ చేస్తాడనుకుంటే.. అతని ప్లేస్‌లో చక్రధర్ వచ్చి షాకిస్తాడు. ఇక తరువాతి ఎపిసోడ్లో మీనాక్షి బతకడం కష్టమే అని అంటున్నారు డాక్టర్.