
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Bandi Sanjay Sircilla Visit: కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సందడి చేశారు. సరికొత్త లుక్కులో కనిపించిన ఆయన స్వయంగా క్లాస్ రూమ్‌లను శుభ్రం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా బిజెపి శ్రేణులు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు..
త్వరలో పాఠశాలలు మొదలు కాబోతున్న నేపథ్యంలో.. విద్యార్థులకు శుభ్రమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈరోజు సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్రమంత్రి సందర్శించారు..
పైపుతో నీళ్లు కొట్టి.. క్లాస్‌రూమ్‌లు క్లీన్ చేసి.. సాధారణంగా మంత్రులు వస్తేనే అధికారులతో పాటు అనుచరులు హడావుడి చేయడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ బండి సంజయ్ మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరించారు. పాఠశాలకు రాగానే స్వయంగా చేతిలోకి చీపిరి తీసుకున్నారు.
తరగతి గదుల్లోని దుమ్ముతో పాటు దూలిని ఊడ్చేశారు.. ఆ తర్వాత వాటర్ పైపులను చేతపట్టుకుని బెంచీలతో పాటు గదులను నీళ్లతో కడిగి తల తలలాడేలా క్లీన్ చేశారు.. కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా ఒక సామాన్య కార్యకర్తల ఆయన శ్రమించిన తీరు స్థానికులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది.
..
సిరిసిల్ల ఎస్పీపై కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం.. ఇదిలా ఉంటే.. ఈ పర్యటనలో ఒక ఆసక్తికర రాజకీయరచ్చ కూడా చోటుచేసుకుంది.. కేంద్ర మంత్రి పాల్గొన్న ఇంత పెద్ద ప్రభుత్వ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ తో పాటు కొంతమంది పోలీస్ అధికారులు హాజరు కాకపోవడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం డిఎస్పీ మాత్రమే అక్కడ అందుబాటులో ఉండడంతో పాటు ఆయన పై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. నేనేమి ఇక్కడ సాధారణ కార్యకర్తగా రాలేదని.. కేంద్ర మంత్రి హోదాలో వచ్చినప్పుడు జిల్లా పోలీస్ బాస్ ఎందుకు హాజరు కాలేదని.. బిజెపి కార్యకర్తలతో పాటు నాయకులు అంటే ఆయనకు ఎందుకంత కోపమని బండి సంజయ్ నిలదీశారు.
KTRపై అంత ప్రేమ ఉంటే BRSలో చేరండి.. పోలీసు అధికారుల పక్షపాత వైఖరి పై బండి సంజయ్ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీ ఎస్పీకి కేటీఆర్ పైన..బీఆర్ఎస్ పార్టీ పైన అంత ప్రేమ ఉంటే.. వెంటనే కాకి చొక్కా తీసేసి గులాబీ కండువా కప్పుకోవాలని.. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ రాజకీయ పక్షపాతం చూపించడం తగదని.. అంటూ ఘాటుగా ఎద్దేవ చేశారు.. ప్రజాస్వామ్యంలో ప్రోటోకాల్‌ను గౌరవించని అధికారుల తీరుపై తాము కోరుకునేది లేదని హెచ్చరించారు. మొత్తానికి బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సిరిసిల్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు