
ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని తారుమారు చేసే అత్యంత ప్రమాదకరమైన ‘ఎల్‌నినో’ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దీనిపై అమెరికాకు చెందిన జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ ‘నోవా’ తాజాగా విడుదల చేసిన నివేదిక అంతర్జాతీయంగా తీవ్ర కలవరం సృష్టిస్తోంది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్ర రూపాన్ని ఇది సంతరించుకోబోతోందని, అందుకే శాస్త్రవేత్తలు దీనికి అనధికారికంగా ‘గాడ్జిలా ఎల్‌నినో’ అని పేరు పెట్టారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే అసాధారణంగా వేడెక్కడాన్ని ‘ఎల్‌నినో’ అంటారు. అయితే, ఈసారి పసిఫిక్ మహాసముద్రం లోతుల నుంచి విపరీతమైన వేడి ఉపరితలంపైకి వస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శిలాజ ఇంధనాల వాడకం, విపరీతమైన కాలుష్యం వల్ల ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్‌తో పుడమి వేడెక్కిపోతోంది. దీనికి ఈ గాడ్జిలా ఎల్‌నినో తోడైతే భూమి మరింత నిప్పుల కుంపటిలా మారే ప్రమాదం ఉందంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ఎల్‌నినో అత్యంత భీకర రూపం దాల్చనుందని ‘నోవా’ హెచ్చరించింది. 1950వ సంవత్సరం తర్వాత, అంటే గత 75 ఏళ్ల చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన, తీవ్రమైన టాప్-5 ఎల్నినోలలో ఒకటిగా ఇది నిలిచే అవకాశం 63 శాతం మేర ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాల గమనం మారిపోతుందని వెల్లడించింది. దీనివల్ల ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన కరవు కాటకాలు, నీటి కొరత ఏర్పడితే.. మరికొన్ని ప్రాంతాలలో మునుపెన్నడూ లేని విధంగా అకాల భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయి. ముఖ్యంగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తిపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. మానవ తప్పిదాల వల్ల ప్రకృతిలో వస్తున్న మార్పులు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పడానికి ఈ ‘గాడ్జిలా’ ఎల్నినోనే ప్రత్యక్ష నిదర్శనం. రాబోయే రోజుల్లో సంభవించబోయే వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఇప్పటి నుంచే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్
బ్లోయింగ్ ఆపరేషన్!
ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్కు..
Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది
Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న
Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?