
"యెమెన్ స్పైడర్ మ్యాన్" గా గుర్తింపు పొందిన యువ అక్రోబాట్ అల్-ఖకా బిన్ అన్తార్ (Al-Qa'qa' bin Antar) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండానే అచ్చం స్పైడర్ మ్యాన్‌లా నిటారైన కొండలను చకచకా ఎక్కేస్తూ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో భారీ గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖాఖా మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. యెమెన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన కొండలు, పర్వతాలను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఎక్కుతూ ఒక అగ్నిపర్వత క్రేటర్ (కుహరం) ఎక్కుతూ, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను పణంగా పెట్టి, అద్భుతమైన సాహసాలతో ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ ఇకలేదన్న వార్త అటు యెమెన్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర విచారాన్ని నింపింది. ధమార్ (Dhamar) ప్రాంతంలోని ప్రసిద్ధ 'హరదత్ దమ్త్' (Haradhat Damt) అగ్నిపర్వత క్రేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 120 మీటర్ల లోతు ఉన్న నిటారైన అగ్నిపర్వత లోయ గోడలను అన్తార్ ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేదా రోప్‌లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన నేరుగా వందల అడుగుల లోతున్న క్రేటర్ అడుగుభాగానికి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టం కావడంతో ఫలితం దక్కలేదు. ఆ లోయ అడుగుభాగంలో గంధకపు వేడి నీరు (sulfurous water లో పడిపోయాడు. అక్కడికి చేరుకోవడానికి సరైన మార్గం లేకపోవడంతో రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు ఆ యువ క్లైంబర్ నిర్జీవ దేహాన్ని అధికారులు బయటకు తీయగలిగారు. అల్-ఖకా బిన్ అన్తార్ యెమెన్‌లోని నిటారైన కొండలు, పురాతన కట్టడాలు,అగ్నిపర్వత శిలలపై రక్షణ లేకుండా ఎక్కుతూ సాహసాలకు నెటిజన్లు ఫిదా అయ్యేవారు. దీనికి సంబంధించిన వీడియోలు చాలా పాపులర్
Jun 13 2026 2:32 PM | Updated on Jun 13 2026 2:32 PM
"యెమెన్ స్పైడర్ మ్యాన్" గా గుర్తింపు పొందిన యువ అక్రోబాట్ అల్-ఖకా బిన్ అన్తార్ (Al-Qa'qa' bin Antar) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండానే అచ్చం స్పైడర్ మ్యాన్‌లా నిటారైన కొండలను చకచకా ఎక్కేస్తూ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో భారీ గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖాఖా మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.
యెమెన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన కొండలు, పర్వతాలను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఎక్కుతూ ఒక అగ్నిపర్వత క్రేటర్ (కుహరం) ఎక్కుతూ, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను పణంగా పెట్టి, అద్భుతమైన సాహసాలతో ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ ఇకలేదన్న వార్త అటు యెమెన్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర విచారాన్ని నింపింది.
ధమార్ (Dhamar) ప్రాంతంలోని ప్రసిద్ధ 'హరదత్ దమ్త్' (Haradhat Damt) అగ్నిపర్వత క్రేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 120 మీటర్ల లోతు ఉన్న నిటారైన అగ్నిపర్వత లోయ గోడలను అన్తార్ ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేదా రోప్‌లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన నేరుగా వందల అడుగుల లోతున్న క్రేటర్ అడుగుభాగానికి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టం కావడంతో ఫలితం దక్కలేదు. ఆ లోయ అడుగుభాగంలో గంధకపు వేడి నీరు (sulfurous water లో పడిపోయాడు. అక్కడికి చేరుకోవడానికి సరైన మార్గం లేకపోవడంతో రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు ఆ యువ క్లైంబర్ నిర్జీవ దేహాన్ని అధికారులు బయటకు తీయగలిగారు.
అల్-ఖకా బిన్ అన్తార్ యెమెన్‌లోని నిటారైన కొండలు, పురాతన కట్టడాలు,అగ్నిపర్వత శిలలపై రక్షణ లేకుండా ఎక్కుతూ సాహసాలకు నెటిజన్లు ఫిదా అయ్యేవారు. దీనికి సంబంధించిన వీడియోలు చాలా పాపులర్ కావడంతో "యెమెన్ స్పైడర్ మ్యాన్" అనే పేరు వచ్చింది.అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన చేసిన ప్రమాదకరమైన క్లైంబింగ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి.
అన్తార్ అకాల మరణంపై యెమెన్‌లోని సోషల్ మీడియా వినియోగదారులు, ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధైర్యాన్ని కొనియాడుతూనే, కేవలం సోషల్ మీడియా లైక్‌లు, వ్యూస్ కోసం ఎలాంటి భద్రత లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఎంత ప్రాణాంతకమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)
'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు)
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
అన్నను మించిన తమ్ముడు 10ఏళ్లకే బుడోడి తమ్ముడు సెంచరీ
వాళ్లే పాపను ఎత్తుకెళ్లారు.. జ్ఞానేశ్వరి పేరెంట్స్ తో Exclusive
నీకు 15 వేలు, నీకు 15 వేలు, నూరి ఫాతిమా మాస్ ర్యాగింగ్
మహిళలకు బాబు షాక్.. ఆడబిడ్డ నిధి ఇవ్వలేం!