
అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో జరిగిన విమాన ప్రమాద ఘటనలో ఐదుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన కో పైలట్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 రవాణా విమానం ఎయిర్‌బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా, మంటలు చెలరేగడంతో కూలిపోయిన సంగతి తెలిసిందే. జోర్హాట్ వైమానిక స్థావరంలో ప్రమాదం.. ఐదుగురి మృతి
|