
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Tirumala September Quota Darshan Booking Schedule: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు తమ వీలును బట్టి SSD టోకెన్లు, ఉచిత దర్శనం లేదా ప్రత్యేక దర్శనం కోసం వస్తుంటారు. ముఖ్యంగా ఆర్జిత సేవలు లేదా రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కావాలనుకుంటే మూడు నెలల ముందే బుక్ చేసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో 2026 సెప్టెంబర్ నెల దర్శనం కోసం టీటీడీ ఈనెల 18వ తేదీ నుండి ఆన్లైన్ కోటను అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా భక్తులు దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దర్శనం సెప్టెంబర్ నెలలో జరుగుతుంది.
ఆర్జిత సేవ టికెట్లు.. 2026 సెప్టెంబర్ నెలలో ఆర్జిత సేవలు పొందడం భక్తులకు ఒక గొప్ప అవకాశం. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మరాధన వంటి సేవలకు సంబంధించిన టికెట్లను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.
ఎలక్ట్రానిక్ డిప్ - జూన్ 20: ఎలక్ట్రానిక్ డిప్ ప్రక్రియ జూన్ 20న ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగుతుంది. జూన్ 22 మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఇది పూర్తవుతుంది. పేమెంట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత భక్తులు తమ టికెట్లను పొందవచ్చు.
జూన్ 22న మరిన్ని సేవలు.. అదే రోజు జూన్ 22న ఉదయం 10 గంటల నుండి కళ్యాణోత్సవం, ఉంజాల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంక టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి వర్చువల్ కోటాకు సంబంధించిన టికెట్లు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
అంగ ప్రదక్షిణ టికెట్లు.. అంగ ప్రదక్షిణ కోటా జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి.. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్లు విడుదల చేస్తారు.
రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు: భక్తులు ఎక్కువగా కోరుకునే రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి లభిస్తాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి గదుల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. ఆన్లైన్ ద్వారా దర్శనం, సేవలు, ప్రత్యేక దర్శనం మరియు తిరుమల, తిరుపతి పరిసరాల్లోని గదుల బుకింగ్ సౌలభ్యం కల్పిస్తున్నారు.
టీటీడీకి అశోక్ లేలాండ్ భారీ విరాళం.. మరోవైపు, ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ శనివారం టీటీడీకి రూ.31, 72,532 విలువైన ఒక ట్రక్కును విరాళంగా ఇచ్చింది. ఆలయ ప్రాంగణంలో వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆ సంస్థ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్, టీటీడీ అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.