
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి
సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఆక్టోపస్ భవనం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా.. దర్శనం క్యూ లైన్లలోకి రేపు ఉదయం నుంచి అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.తిరుమలలో గత నెల నుంచి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రత్యేక సేవల సమయం లోనూ సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. ఇదే సమయంలో టీటీడీ సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన...సేవలు.. వసతి కోటా విడుదల పైన ప్రకటన చేసింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.TTD: తిరుమలకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు కీలక అప్డేట్..!!దర్శనం.. సేవలు.. వసతి ఇలాకాగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. అదే విధంగా వార్షిక పవిత్రోత్సవాల (23-09-26 నుండి 25-09-26) టికెట్లను కూడా జూన్ 21 ఉదయం 10గం. ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వ‌యో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.