
ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో రెగ్యులర్ గా పాలు ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు వాడుతూనే ఉంటారు. అయితే.. పాల ప్యాకెట్ లేదా.. నూనె ప్యాకెట్ కట్ చేసిన తర్వాత వాటిని పట్టుకోవడం, వేరే గిన్నెలోకి ఒంపేటప్పుడు
జారిపోతూ ఉంటాయి. దీని వల్ల కింద పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఈ సమస్యను దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే.. ఈ సమస్యకు చెక్ పెట్టే సొల్యూషన్ వచ్చేసింది. అదే ప్యాకెట్ హోల్డర్.
ఇది చూడటానికి చిన్న డబ్బాలా కనిపిస్తుంది. ప్లాస్టిక్ తో తయారు చేసిన స్పెషల్ కిచెన్ ఆర్గనైజర్. పాలు, నూనె లేదా ఏదైనా ద్రవ పదార్థాల ప్యాకెట్లను ఇందులో ఉంచి సులభంగా ఉపయోగించవచ్చు.సిలిండర్ ఆకారంలో ఉండే ఈ హోల్డర్ కు హ్యాండిల్ కూడా ఉంటుంది. ఇది వాడటం వల్ల.. మనం ప్యాకెట్ ని డైరెక్ట్ గా చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఈ హోల్డర్ స్పిల్ ప్రూఫ్ డిజైన్ తో ఉంటుంది. కాబట్టి.. దీంట్లో మనం ప్యాకెట్ పెట్టినా కూడా.. లిక్విడ్ బయటకు లీక్ అయిపోతుంది అనే భయం అక్కర్లేదు. ముఖ్యంగా.. చిన్న పిల్లలు.. ముసలివాళ్లు కూడా దీనిని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అయితే.. పాల ప్యాకెట్ చిన్నగా ఉంటుంది.. ఆయిల్ ప్యాకెట్ పెద్దగా ఉంటుంది.. రెండింటికీ ఇది ఎలా సెట్ అవుతుంది అనే సందేహం మీకు రావచ్చు.. ఈ కంటైనర్ మనకు రెండు సైజుల పరిమాణంలో లభిస్తుంది. ఒకటి చిన్నది మరోకటి పెద్ది. చిన్న సైజులో పాల ప్యాకెట్ పెట్టుకుంటే.. పెద్ద దాంట్లో ఆయిల్ ప్యాకెట్ పెట్టొచ్చు.
పాల ప్యాకెట్ కట్ చేసి పాత్రలో పోస్తున్నప్పుడు కింద పోతున్నాయనే భయం ఉన్నవారికి ఇది చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతేకాదు.. ఒకసారి కట్ చేసిన పాల ప్యాకెట్ లోని పాలు కొద్దిగా వాడుకున్న తర్వాత మిగిలిన వాటిని వేరే పాత్రలో పోయాల్సిన అవసరం లేకుండా.. ఈ కంటైనర్ లోనే ఉంచేయచ్చు. అంతేకాదు... ఆయిల్ ప్యాకెట్ కి ఆయిల్ అంటితే జారిపోతుంది. అదే ఈ కంటైనర్ ఉంటే ఆ ప్రాబ్లమ్ ఉండదు. అంతేకాదు.. మీ కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. రోజువారీ వంట గదిలో చిన్న చిన్న సమస్యలను సులభంగా పరిష్కరించే ఉత్పత్తుల్లో ఇది ఒకటి. ముఖ్యంగా పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు తరచూ ఉపయోగించే కుటుంబాలకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.