
Drishyam 3 : దృశ్యం సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం దృశ్యం 3. మోహన్ లాల్, మీనా, అన్సీబా హాసన్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రలో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 21న
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో పాటు తెలుగులో ఈ చిత్రం రిలీజైంది. తెలుగులో తొలి రెండు భాగాల్లో వెంకటేశ్‌తో రీమేక్ చేయించగా.. ఈ సారి మాత్రం మలయాళ చిత్రాన్నే తెలుగులో డబ్ చేసి వదిలారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికి 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ ప్రైమ్ శుభవార్త చెప్పింది. Saanve Megghana : సుబ్రహ్మణ్యుడి సన్నిధిలో తెలుగు నటి శాన్వి మేఘన.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్ జూన్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. Georgekutty and family awaits you ✨#Drishyam3OnPrime, June 18@mohanlal @jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk @aashirvadcine @PanoramaMovies @PenMovies @Rajeshmenon1969 — prime video IN (@PrimeVideoIN) June 13, 2026