
మాట వెండి అయితే, మౌనం బంగారం లాంటిది అని ఒక ఆంగ్ల సామెత. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. దీనివల్ల మన చుట్టూ ఉన్న సంబంధాలు బాగుంటాయి. అయితే అన్ని సమయాల్లోనూ మౌనంగా
Jun 13 2026 10:27 AM | Updated on Jun 13 2026 10:27 AM
మాట వెండి అయితే, మౌనం బంగారం లాంటిది అని ఒక ఆంగ్ల సామెత. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. దీనివల్ల మన చుట్టూ ఉన్న సంబంధాలు బాగుంటాయి. అయితే అన్ని సమయాల్లోనూ మౌనంగా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు మౌనంగా ఉంటే మంచిదో తెలుసుకుందాం!
మాటలు మంత్రంలా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఆ మాటలే మంటల్ని సృష్టిస్తాయి. అలాంటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. మౌనం అనేది చాలా సందర్బాల్లో రిలేషన్స్‌లో గొడవలు లేకుండా చేస్తుంది. మన విలువని కూడా కా΄ాడుతుంది. అదెప్పుడో చూద్దాం..
ముఖ్య విషయాలు చెబుతున్నప్పుడు.. ఇంటికి సంబంధించినవి కావచ్చు, ఆఫీస్‌కి సంబంధించిన విషయాలు కావొచ్చు.. ఇలా దేనికి సంబంధించి విషయాలైనా ఎదుటివారు చెప్పినప్పుడు అవి వినడం తప్ప మధ్యలో కల్పించుకోకూడదు. విషయం పూర్తయ్యాకే మాట్లాడాలి. అప్పటివరకూ మౌనంగా ఉండడమే ఉత్తమం.
ముందే పరిష్కారం దొరికినప్పుడు.. మీకంటే ముందే ఎవరైనా విషయం గురించి చెప్పి ఇంకా మీరు చెప్పడానికి ఏం లేనప్పుడు కూడా మీరు సైలెంట్‌గా ఉండడం మంచిది. ఇతరులు చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. కానీ, అదే విషయాన్ని మీరు మొదట్నుంచీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు.
విషయం తెలియనప్పుడు.. మాట్లాడేటప్పుడు ఆ సందర్భం, ఆ సమస్య గురించి కచ్చితంగా పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అలా ఏం తెలియకుండా మాట్లాడొద్దు. దీనికంటే ఆ సమయంలో మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే, ఇలాంటప్పుడు మీ మాటలు ఎవరు పట్టించుకోరు. మీరు నలుగురిలో నవ్వుల΄ాలయే అవకాశం ఉంది.
రుజువు చేసుకోలేనప్పుడు... మీరు మాట్లాడే విషయాల గురించి సాక్ష్యాలు కచ్చితంగా ఉండాలి. అంతేకానీ, ఏవో ఊహించి మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల వేరే వ్యక్తులపై మానసిక, శారీరక ప్రభావం చూపే అవకాశం ఉంది.
అవతలివారిని బాధపెట్టే సందర్భంలో... మన మాటల వల్ల మనకి కానీ, ఎదుటివారికి కానీ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివారిని నొప్పించే సందర్భాలు ఉంటే అలాంటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది.
మనసు బాగోలేనప్పుడు... అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఒక్కోసారి అలవోకగా మాట్లాడే మనం మరికొన్నిసార్లు స్పష్టంగా మాట్లాడలేం. దీనికి కారణం మన మనసు బాలేకపోవడం, అలసిపోయి ఉండడం, ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ సమయంలో మీరు కోపంగా, ఆత్రంగా మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆలోచించడం మంచిది.
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
FLO StyleTatva 6వ ఎడిషన్‌ను ప్రారంభించిన విజయలక్ష్మి , సుధా రెడ్డి (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో...అందమైన భామలు లేత మెరుపు తీగలు (ఫొటోలు)
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
నేను నా కొడుకు దద్దమ్మలం.. మీ సంపద మీరే సృష్టించుకోండి చేతులెత్తేసిన చంద్రబాబు..
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
యుద్ధం ముగించలేదు.. ట్రంప్ కు ఇరాన్ హెచ్చరిక
పాప తల్లి షాకింగ్ నిజాలు! జ్ఞానేశ్వరి తండ్రిపై పెరుగుతున్న అనుమానాలు..?
కడప MLA కాదు కూల్చివేతల MLA.. మాదవి రెడ్డిపై కడప మాజీ మేయర్ ఫైర్