
టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు, హిట్స్ కొట్టారు. కానీ, అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ ఒక్క క్షణం.. అఖిల్ (Akkineni Akhil) ఖాతాలో ఒక సాలిడ్
, పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడటం.
టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు, హిట్స్ కొట్టారు. కానీ, అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ ఒక్క క్షణం.. అఖిల్ (Akkineni Akhil) ఖాతాలో ఒక సాలిడ్, పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడటం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో డీసెంట్ హిట్ ఉన్నా అంతకు మించి కమర్షియల్ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో అఖిల్ ఒక్కసారిగా స్లో అయ్యాడు. దాదాపు మూడేళ్ల పాటు ఇండస్ట్రీకి, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్న మన అయ్యగారు.. ఇప్పుడు లెనిన్ అనే పవర్ ఫుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీతో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
ఎప్పుడూ స్టైలిష్ యాక్షన్ హీరోగా, లవర్ బాయ్ గా కనిపించే అఖిల్.. ఈసారి రూట్ మార్చాడు. దర్శకుడు అబ్బూరి మురళీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఒక పక్కా రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా. ప్రస్తుతం టాలీవుడ్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సరిగ్గా ఇదే పాయింట్ ను పట్టుకుని అఖిల్ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఫస్ట్ టైమ్ ఒక పక్కా లోకల్ కుర్రాడిగా, ఊర మాస్ గెటప్ లో అఖిల్ కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ చూస్తుంటే.. ఈ విలేజ్ డ్రామా చాలా ప్రామిసింగ్ గా ఉండబోతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కింగ్ నాగార్జున రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన నాగార్జున.. తన ఎక్సైట్ మెంట్ ను ఏమాత్రం ఆపుకోలేకపోయారు. ఒక సరికొత్త అఖిల్ ను చూడబోతున్నారు అంటూ ఆయన వేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. నాగ్ అంత కాన్ఫిడెంట్ గా పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద చెప్తున్నారంటే, కచ్చితంగా కంటెంట్ లో దమ్ము ఉండి తీరుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అఖిల్ కష్టానికి ఈసారి పక్కాగా ఫలితం దక్కబోతోందని సంబరాలు కూడా మొదలుపెట్టారు.
ఇంతవరకు అంతా బాగానే ఉంది.. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సినిమా రిలీజ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, జూన్ 26న పక్కాగా థియేటర్లలో దిగుతున్నామని మేకర్స్ ముందుగా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈసారి ఎలాంటి పోస్ట్ పోన్ డ్రామాలు ఉండవని అంతా ఊపిరి పీల్చుకున్నారు. తీరా చూస్తే.. ఇప్పుడు అనూహ్యంగా లెనిన్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో.. జూన్ 26 నుంచి జూలై 10 కి సినిమాను షిఫ్ట్ చేశారని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ.. ఇలా లాస్ట్ మినిట్ లో వాయిదా పడటం అక్కినేని అభిమానులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. నాలుగేళ్లు వెయిట్ చేశాం, ఈ కొద్ది రోజులు ఆగిపోలేమా అని కొందరు పాజిటివ్ గా తీసుకుంటున్నా.. ఎక్కువ మంది మాత్రం ఈ కన్ఫ్యూజన్ ఏంటని పెదవి విరుస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే.. చిత్ర బృందం నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.
Transfer Trimurthulu Trailer: కానిస్టేబుల్ వేసిన స్కెచ్‌కి సీఎం మైండ్ బ్లాక్..
Dridam: అదేం క్లైమాక్స్ రా మావా.. మెంటలొచ్చేస్తది అంతే
Vikram: 60 ఏళ్ళ వయస్సులో ఆ ఫిట్ నెస్ ఏంటి సామీ..