
రక్షణ రంగంలో డీఆర్డీవో సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ వరుసగా 3 కీలక క్షిపణి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు
.
హైదరాబాద్, జూన్ 13: రక్షణ రంగంలో డీఆర్డీవో సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ వరుసగా 3 కీలక క్షిపణి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ రక్షణ రంగం మరింత బలపడుతోందన్నారు. డీఆర్డీవో(DRDO) అభివృద్ధి చేసిన బహుళ-స్థాయి బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించారని అన్నారు. మధ్య శ్రేణి నౌకాదళ యాంటీ-షిప్ క్షిపణి కూడా విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయిగా నిలిచాయన్నారు.
దేశ భద్రతను మరింత బలోపేతం చేసే కీలక అడుగులు ఇవి అని రాంచందర్ రావు చెప్పుకొచ్చారు. ఆధునిక క్షిపణి రక్షణ సామర్థ్యాలు కలిగిన కొద్ది దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. ఈ చరిత్రాత్మక విజయానికి కృషి చేసిన డీఆర్డీవో(Defence Research and Development Organisation) శాస్త్రవేత్తలు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వారి అంకితభావం సురక్షితమైన, స్వావలంబనతో కూడిన, వికసిత భారత నిర్మాణానికి బలాన్ని అందిస్తోందని రాంచందర్ రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: మంత్రి నారాయణ
హైదరాబాద్‌లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం
Read Latest Telangana News And Telugu News