
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Telangana Weather Update: తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు ఈ యేడాది ఎల్‌నినో ప్రభావంతో పలు చోట్ల ఇంకా ఎండలు తగ్గు ముఖం పట్టడం లేదు. పలు ప్రాంతాల్లో ఇంకా వడగాలులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 15కు పైగా జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు ఏరియాల్లో వడగాలులు వీచాయి. ఇక రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో 42.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
22 జిల్లాలోల 40 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రతలు..
తెలంగాణలో జూన్ నెల 10 దాటినా.. ఇంకా పలు చోట్లు ఉష్ణోగ్రతలు తగ్గలేదు. దాదాపు 22 జిల్లాల్లో 40.5 డిగ్రీల నుంచి 42.7 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి. ముఖ్యంగా వికారబాద్, సిద్ధిపేట, నిజామాబాద్‌లో ఎండలతో పాటు తీవ్రమైన వడగాలులు వీచాయి. మరోవైపు గురువారం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి.
ఇక రెండు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. దీంతో రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో ప్రజలు వర్షం పడే సమయంలో చెట్లు, కరెంట్ స్తంభాలు, హోర్డింగులకు దూరంగా ఉండాలని సూచించింది.
మరోవైపు హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం సమయంలో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా ఈ సమయంలో ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో కాకుండా ప్రభుత్వ రవాణాలో ప్రయాణించడం కానీ.. కారు పూలింగ్ ద్వారా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.