గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈ వారం అంతా రోహిణి చుట్టూనే తిరిగింది. బాలు తన పాత ఫోన్ కొట్టేసింది రోహిణి లేదా విద్య అయి ఉంటుందని అనుమానంతో వేట మొదలు పెడతాడు. చివరకు విద్యను బాలు ప్రశ్నిస్తాడు
. కానీ విద్య మాత్రం దొరక్కుండా అబద్దాలు చెబుతూనే ఉంటుంది. ఇంకో వైపు బాలుని ట్రాఫిక్ కానిస్టేబుల్ ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. తన కారుని సీజ్ చేయడంతో బాలు ఆగ్రహంతో ఊగిపోతాడు. ఆ కోపంలోనే మీనాపై గట్టిగా అరుస్తాడు. కానీ మీనా మాత్రం తన ఇన్ ఫ్లూయెన్స్ వాడి బాలు కారుని విడిపిస్తుంది. దీంతో బాలు కూల్ అయిపోయి మీనాని పొగిడే పని పెట్టుకుంటాడు.ఇంకో వైపు రోహిణిని దెయ్యం పట్టిందేమో అని మనోజ్, ప్రభావతి కలిసి రోజూ బడిత పూజ చేస్తుంటారు. చాలా వరకు సహించిన రోహిణి.. చివరకు తిరగబడుతుంది. ఇదే ఛాన్స్ అనుకుని ఆత్మ ఉన్నట్టుగా నటించి.. ప్రభావతి, మనోజ్‌ని పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఇంకోసారి నా కూతురిని ఆస్తి కోసం వేధిస్తే మళ్లీ వస్తా.. మీ తాట తీస్తా అన్నట్టుగా రోహిణిలోని ఆత్మ చెప్పినట్టుగా నటించేస్తుంది. చివరకు కళ్లు తిరిగి పడిపోతుంది. ఏం జరిగింది.. ఆ దెబ్బలు ఏంటి.. అని ఏమీ తెలియని నంగనాచిలా మొహం పెడుతుంది రోహిణి.మరో వైపు శ్రుతి, రవి వారి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తారు. కానీ నీతూతో రవి ఉన్న సందర్భాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఎటో వెళ్లిపోతుంది శ్రుతి. నీతూ కాలి జారి పడిపోతే.. ఆమెను రవి ఎత్తుకుంటాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా శ్రుతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎటో వెళ్లిపోతుంది. ఇక ఫంక్షన్‌కి టైం దగ్గర పడుతున్నా శ్రుతి రాదు. దీంతో రవి కంగారు పడిపోతూ ఉంటాడు. శ్రుతి ఆచూకి కోసం బాలు, మీనా తిరుగుతూనే ఉంటారు. చివరకు శ్రుతిని కలిసి.. జరిగిన విషయం అంతా చెబుతారు. అప్పుడు శ్రుతి రియలైజ్ అవుతుంది. ఇంకాస్త ఉండుంటే.. ఏకంగా లాయర్ నుంచి విడాకుల నోటీసు పంపించేది శ్రుతి.ఇక వెడ్డింగ్ యానవర్సరీలో ప్రభావతి, కామాక్షిల చేత పదే పదే స్టెప్పులు వేయిస్తాడు రవి. శ్రుతి రావడం ఆలస్యం అవుతుండటంతో టైం పాస్ కోసం ఆ ఇద్దరితో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టిస్తాడు. వారిద్దరికీ అదొక శిక్షలా అయిపోతుంది. స్టేజ్ మీద శ్రుతి రవి కలిసి బాలు, మీనాలను పొగిడేస్తుంటారు. బెస్ట్ కపుల్స్ అని ప్రశంసిస్తుంటే మనోజ్, రోహిణి, ప్రభావతిల మొహం మాడిపోతుంది. అలా ఈ వారం అంతా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్లతో సీరియల్ సాగింది.