సాధారణంగా మినీ స్ట్రోక్‌ని ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ ఎటాక్ (Transient Ischemic Attack) అని పిలుస్తారు. ఇది మెదడుకు జరిగే రక్త ప్రసరణలో తాత్కాలికంగా బ్రేక్ ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. చిన్న రక్తపు
గడ్డలు (Blood Clots) లేదా రక్త నాళాలు ఇరుకుగా మారడం వల్ల ఇది జరుగుతుంది. ఈ మిని స్ట్రోక్ లక్షణాలు కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు మాత్రమే ఉండి తర్వాత తగ్గిపోతాయి. దీని వల్ల మెదడుకు శాశ్వత నష్టం జరగనప్పటికీ.. ఇది భవిష్యత్తులో రాబోయే పెద్ద పక్షవాతానికి బలమైన సంకేతం లాంటిది. ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ ఎటాక్ వచ్చిన మొదటి 48 గంటల నుంచి మూడు నెలల లోపు పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ముందే గుర్తించి చికిత్స అందించడం చాలా ముఖ్యం. దీని లక్షణాలు, కారణాలు, చికిత్స విధానాలు గురించి పూర్తి సమాచారం అందించారు డాక్టర్ కందరాజు సాయి సతీష్ (సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్). ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మినీ స్ట్రోక్ (ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ ఎటాక్) లక్షణాలు ఈ కింది లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. శరీరంలో ఒకవైపు (చేయి లేదా కాలు) బలహీనత లేదా మొద్దుబారడం. ముఖం ఒకవైపుకు తిరిగిపోవడం మాట్లాడటంలో ఇబ్బంది లేదా ఇతరులు మాట్లాడేది అర్థం చేసుకోలేకపోవడం. మైకం కమ్మడం (Dizziness), నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం. చూపు మసకబారడం లేదా ఒక కన్ను కనిపించకపోవడం. గందరగోళానికి (Disorientation) గురికావడం. గమనిక: ఈ లక్షణాలు త్వరగా తగ్గిపోయినప్పటికీ, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.మినీ-స్ట్రోక్‌కు దారితీసే కారణాలు (Risk Factors) మన జీవనశైలిలోని లోపాలు, కొన్ని ఆరోగ్య సమస్యలు మినీస్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం, ఊబకాయం (Obesity). ధూమపానం, మితిమీరిన మద్యపానం. గుండె జబ్బులు, గుండె లయ తప్పడం విపరీతమైన మానసిక ఒత్తిడి (Stress), శారీరక శ్రమ లేకపోవడం వయసు పైబడటం లేదా గతంలో స్ట్రోక్/TIA వచ్చిన చరిత్ర ఉండటం.వ్యాధి నిర్ధారణ పరీక్షలు (Diagnosis) వైద్యులు రోగిని క్షుణ్ణంగా పరీక్షించి, మెదడులో రక్తస్రావం లేదా గడ్డలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ కింది పరీక్షలు చేస్తారు. MRI లేదా CT స్కాన్ (మెదడు ఇమేజింగ్ కోసం). కరోటిడ్ డాప్లర్ అల్ట్రాసౌండ్ (మెడలోని రక్తనాళాల్లో బ్లాక్స్ తెలుసుకోవడానికి). ECG, ఎకోకార్డియోగ్రఫీ (గుండె పనితీరును పరీక్షించడానికి). రక్త పరీక్షలు (షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను చూడటానికి).చికిత్స, నివారణ మార్గాలు చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశ్యం భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్ రాకుండా కాపాడటమే. మందులు: డాక్టర్ సలహా మేరకు బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచేవి), యాంటీప్లేట్లెట్ మందులు, బీపీ, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. జీవనశైలి మార్పులు: ధూమపానం పూర్తిగా మానేయాలి. ఉప్పు, కొవ్వు పదార్ధాలను తగ్గించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి.ముఖ్యమైన విషయాలు "FAST" సూత్రాన్ని గుర్తుంచుకోండి.స్ట్రోక్ లేదా TIA లక్షణాలను సులభంగా గుర్తించడానికి అంతర్జాతీయంగా FAST అనే పద్ధతిని వాడుతుంటారు: F - Face Drooping: నవ్వినప్పుడు ముఖం ఒకవైపుకు వాలిపోతుందా? A - Arm Weakness: రెండు చేతులనూ పైకి లేపినప్పుడు ఒక చేయి కిందకు పడిపోతుందా? S - Speech Difficulty: మాట్లాడేటప్పుడు మాట ముద్దగీస్తోందా? లేదా స్పష్టత లేదా? T - Time to call Emergency: ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే సమయం వృథా చేయకుండా ఆసుపత్రికి వెళ్ళాలి.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ కందరాజు సాయి సతీష్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, హైదరాబాద్