
‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్, తాజాగా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రంలో తాను పోషించిన సావిత్రి పాత్ర తరహాలోనే, మళ్లీ అంతటి బలమైన మరియు
గుర్తింపు తెచ్చే పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని ఆమె వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు."మహానటి నా జీవితాన్నే మార్చేసింది. అంతటి గొప్ప నటి పాత్రను పోషించడానికి మొదట్లో భయపడినప్పటికీ, అది ఒక అరుదైన అవకాశం అని నాకు తెలుసు. ఆ చిత్రం నాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే, గత కొంతకాలంగా ఆ స్థాయి విజయం దక్కలేదు. ప్రస్తుతం మళ్లీ అలాంటి పవర్ఫుల్ పాత్రల కోసమే ఎదురుచూస్తున్నాను" అని కీర్తి సురేష్ వివరించారు. మహానటి విడుదలైన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు తనకు ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదని ఆమె గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే, బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు సరసన ‘రఫ్తార్’ అనే చిత్రంలో నటిస్తున్నారు; ఇది జూలైలో విడుదల కావాల్సి ఉంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ‘రౌడీ జనార్ధన’, ‘రెండు జెళ్ల సీత’ చిత్రాలతో పాటు, తమిళంలో ‘కన్నివేది’, మలయాళంలో ‘తోట్టం’ వంటి విభిన్న ప్రాజెక్టులతో ఆమె బిజీగా గడుపుతున్నారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూనే,