
ఇటీవల భారత క్రికెట్లో సూర్యవంశీ అనే పేరు మారుమోగిపోతోంది. అయితే ఈసారి వెలుగులోకి వచ్చింది ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ కాదు, అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. అన్న టీమిండియాకు ఎంపికై దేశవ్యాప్తంగా
గుర్తింపు పొందితే, తమ్ముడు స్థానిక మ్యాచ్‌లో అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు క్రికెట్లో తమ ప్రతిభను చాటుతుండటంతో వారి స్వస్థలం బిహార్‌లోని సమస్తిపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.తమ్ముడి సూపర్ ఇన్నింగ్స్సమస్తిపూర్లోని క్రికెట్ అకాడమీ తాజ్పూర్ తరఫున ఆడిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ సూర్యవంశీ చెలరేగాడు. 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. 118.39 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఆశీర్వాద్, తన అన్నలాగే బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించగలనని నిరూపించాడు. తమ్ముడి అద్భుత ప్రదర్శనపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ, సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు.వైభవ్ సంచలనం.. టీమిండియాకు పిలుపుమరోవైపు, వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ టోర్నమెంట్లో 16 మ్యాచ్‌లలో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి స్టార్ బ్యాటర్లను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలవడం అతని ప్రతిభకు నిదర్శనం. ఈ అద్భుత ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులో వైభవ్‌కు తొలిసారిగా చోటు దక్కింది.స్వగ్రామంలో సంబరాలు.. తండ్రి ఆనందంవైభవ్ టీమిండియాకు ఎంపికయ్యాడన్న వార్త తెలియగానే అతని స్వగ్రామం తాజ్‌పూర్‌లో సంబరాలు