
రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో నిర్వహించిన ‘డిజి 100 ఎక్స్
ఆంధ్రప్రదేశ్’ ఉన్నత విద్యా సదస్సుకు లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో నిర్వహించిన ‘డిజి 100 ఎక్స్ ఆంధ్రప్రదేశ్’ ఉన్నత విద్యా సదస్సుకు లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి విద్యాసంస్థ ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.