
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది
Jun 13 2026 6:46 AM | Updated on Jun 13 2026 6:46 AM
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.
కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వీసా స్టేటస్ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్ పత్రాలు అప్డేట్ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.
ఈ తరహా కాల్స్‌లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, లేదా డిపోర్టేషన్ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్సైట్ లేదంటే నేరుగా కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించారు.
కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్‌గా భావించాలని సూచించారు.
అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్‌కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు.
నా ప్రాణానికి అప్పుడే రెండేళ్లు.. కుమారుడితో అమలాపాల్ (ఫోటోలు)
మూడు ముళ్ల బంధానికి ఆరేళ్లు.. సతీమణికి నవీన్ చంద్ర విషెస్ (ఫోటోలు)
నువ్వు నా భర్తగా రావడం అదృష్టం.. తబిత సుకుమార్ ఎమోషనల్ (ఫోటోలు)
శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్సీపీ సమర శంఖం (ఫొటోలు)
ఆ 600 కోట్ల భూమి ఎవరికీ ఇచ్చారు? భూమన ప్రశ్నల వర్షం
గృహిణులు బానిసలు కాదు , 30,000లతో నష్టపరిహారం
Viral Video: ఫ్లైట్‌లో కోడలితో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ట్విట్టర్లో సెకండ్ ప్లేస్
పోలీస్ స్టేషన్ ముందు జేసీ ఓవర్ యాక్షన్ నడ్డి రోడ్డుపై స్నానం