
Tadipatri JC Prabhakar Reddy Protest: అనంతపురం జిల్లాలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన తాడిపత్రిలో రాజకీయ రగడ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. వైఎస్సార్సీపీ మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి
పెద్దారెడ్డిపై చట్టప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ.. మున్సిపల్ చైర్మన్, టీడీపీ మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ముందే ఏకంగా మంచం వేసుకుని, అక్కడే స్నానం చేసి సుమారు 6 గంటల పాటు అసాధారణ నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని స్థానిక పోలీసులు వెనకేసుకొస్తూ కాపాడుతున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు పోలీసులు లొంగివచ్చి కేతిరెడ్డిపై కేసు నమోదు చేయడంతో జేసీ తన ఆందోళనను విరమించారు.4
Read Also: Kalyanadurgam Politics: కళ్యాణదుర్గంలో మద్యం రాజకీయాలు.. టిడిపి-వైసీపీ మధ్య పోరు!
రాజకీయ వర్గాల వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం తాడిపత్రిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను తీవ్రంగా అవమానించేలా మాట్లాడటమే కాకుండా, తనపై గతంలో హైకోర్టు విధించిన కఠిన ఆంక్షలను సైతం పెద్దారెడ్డి బహీరంగంగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా పోలీస్ స్టేషన్ ముఖద్వారం ఎదుటే మంచం వేసుకుని బైఠాయించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టడంతో పోలీసులు ఎట్టకేలకు దిగొచ్చారు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించి సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగించినందుకు గానూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కొత్త చట్టం ప్రకారం బీఎన్ఎస్ యాక్ట్ 196 (1) [BNS Act 196(1)] సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారిక పత్రాన్ని పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వయంగా అందజేసిన తర్వాత, ఆయన తన వందలాది మంది అనుచరులతో కలిసి నిరసన ముగించి ఇంటికి వెళ్ళిపోయారు.
తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ పొలిటికల్ హీట్ నేపథ్యంలో పోలీసుల తదుపరి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నిరసన ముగింపు సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్నా పోలీసులు మిన్నకుండిపోవడం దారుణమన్నారు. తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడుతున్నామని, దీనిపై వచ్చే సోమవారం నాడు అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) కార్యాలయానికి వెళ్లి ఎస్పీని స్వయంగా కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Bhavan Press Meet:పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఎక్కడ?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్!
JC Prabhakar Reddy Sensational Comments: పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Kalyandurg news: ఓటర్ల నమోదులో తప్పిదాలు వద్దు: ఎమ్మెల్యే సురేంద్రబాబు
MLA Amilineni Surendrababu:అభివృద్ధే అమిలినేని సురేంద్రబాబు అజెండా: టీడీపీ నేతలు!
Valmiki Maharshi Pratibha Awards:ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వాల్మీకి అవార్డులు!
Roddam Tragedy: తల్లిదండ్రులకు తీరని వేదన.. నీటి కుంటలో మునిగి ముగ్గురు పిల్లలు మృతి
Gooty bus accident: గుత్తి వద్ద బస్సు బోల్తా.. బాధితుల వివరాలు ఇవే.
Anantapur Bus Accident: అనంతపురం సమీపంలో NH-44 పై బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు