
గృహహింస చట్టం కింద భర్తకు విధించిన శిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య దిల్లీ: దాంపత్య జీవితంలో తలెత్తే చిన్న చిన్న కలతల కారణంగా భార్యాభర్తలు కొన్నాళ్లు మాట్లాడుకోకపోవడం సహజమేనని సుప్రీంకోర్టు
పేర్కొంది. కేవలం 13 రోజులు భార్యతో సంభాషించకపోయినంత మాత్రాన దానిని క్రూరత్వంగా భావించలేమని జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ధర్మాసనం పేర్కొంది. గృహ హింస చట్టం (ఐపీసీ సెక్షన్ 498ఎ) కింద భర్తకు విధించిన శిక్షను రద్దు చేసింది. అతనికి పాస్‌పోర్టు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఒమన్‌లో ఉన్న భర్త 13 రోజుల పాటు అలకవహించడం వల్లే పుట్టింట్లో ఉన్న భార్య ఆత్మహత్యకు పాల్పడిందన్న ప్రాసిక్యూషన్ వాదనను తిరస్కరించింది. వారిద్దరి మధ్య వాట్సప్ సందేశాలు కూడా లేవని చెబుతూ దానిని సాక్ష్యంగా చూపటాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ‘భర్త కుటుంబ సభ్యులపై మోపిన వరకట్నం వేధింపుల ఆరోణలు నిరాధారమని కింది కోర్టులు తేల్చాయి. ఈ కేసులో గృహ హింసకు పాల్పడినట్లు ఇతరత్రా ఆధారాలేమీ లేవు. మాట్లాడకపోవడం కారణంగానే ట్రయల్ కోర్టు శిక్ష విధించడం, దీనిని మద్రాస్ హైకోర్టు సమర్థించడం సరికాదు’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.