
‘‘మేం అధికారంలోకి వచ్చాక మొదట పగ సాధిస్తాం.. ఆ తర్వాతే అభివృద్ధి’’ అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిడుగురాళ్ల, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ‘‘మేం అధికారంలోకి
వచ్చాక మొదట పగ సాధిస్తాం.. ఆ తర్వాతే అభివృద్ధి’’ అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా గురజాలలో శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో కాసు మాట్లాడుతూ గత రెండేళ్లలో గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలకు రంగులు వేసుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి ఒక్కరిపైనా పగ సాధిస్తామని హెచ్చరించారు.