
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
DA HIKE 2026: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు వేతనాలు సవరించేందుకు ఎనిమిదవ పే కమిషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పే కమిషన్ అధ్యయనం ప్రారంభించి దాదాపు 6 నెలల సమయం గడిచింది. మరో ఏడాది కాలంలోగా 8వ పే కమిషన్ సంబంధించి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులే ఇంకా అమలు అవుతున్నాయని చెప్పాలి.
అయితే ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసినటువంటి డీఏ పెంపుదల ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. 2026 ఏడాదికి సంబంధించిన మొదటి డి ఏ రెండు శాతం పెంచుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం డిఏ 58శాతం నుంచి 60శాతానికి చేరుకుంది. డీఏ అంటే డియర్ నెస్ అలవెన్స్ అని అర్థం. పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకు ఉద్యోగులకు డిఏ.. పెన్షనర్లకు డిఆర్ చెల్లిస్తుంటారు.
2026 సంబంధించి ఇప్పటికే ఒక దఫా డి ఏ చెల్లించారు. అయితే మొత్తం 58% గా ఉన్న డి ఏ 60 శాతానికి చేరుకుంది. ఈ లెక్కన 18వేల రూపాయల వేతనం పొందే ఒక ఉద్యోగి అదనంగా 360 రూపాయల వేతనం పెరుగుతుంది. ఈ లెక్కన ఆరు నెలలకు గాను గమనిస్తే 2610 రూపాయలు అదనంగా లభిస్తాయి. ఇక రెండో దఫా కిందా జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు వర్తించే డి ఏను మరో మూడు శాతం పెంచినట్లయితే అప్పుడు డిఏ 60% నుంచి 63 శాతానికి పెరుగుతుంది .
ఈ లెక్కన గమనిస్తే 18 బేసిక్ వేతనం లభించే ఉద్యోగికి మూడు శాతం డి ఏ పెంచినట్లయితే నెలకు 540 రూపాయలు అదనంగా లభిస్తాయి. అంటే దీని ఆరు నెలల మొత్తానికి లెక్కించినట్లయితే 5400 అవుతుంది. మరోవైపు 8వ పే కమిషన్ సంబంధించి తమ విజ్ఞప్తులను కమిషన్‌కు తెలియజేసేందుకు జూన్ 15వ తేదీ వరకు అవకాశం ఉంది. అప్పటివరకు ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఎనిమిదవ పే కమిషన్ కి తెలియజేయడానికి అవకాశం ఉంది.
అయితే ఇది అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే ఛాన్స్ ఉంది. ఎలాంటి మెమొరండంలో స్వీకరించేందుకు కమిషన్ అవకాశం ఇవ్వలేదు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ తెలియజేస్తూ ఎనిమిదో వేతన సంఘానికి ఆన్లైన్ ద్వారా మెమోరండమ్స్ పంపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు ఉద్యోగ సంఘాలు ఈసారి వేతన విషయంలో గట్టిపట్టు పడుతున్నాయి. ఏడవ వేతనం సంఘం సిఫారసు చేసిన 2.57 కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని పెద్దెత్తునా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై మరి వేతన సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.