
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి తీవ్రస్థాయిలో
విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక ‘సూపర్ ఫ్లాప్ నేత’ అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తేల్చేశారని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో పవన్‌ను నమ్మి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ఆయన ఘోరంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంగా కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా రెచ్చగొట్టి, వారి ఓట్లను కూటమి వైపు మళ్లించుకున్నాక.. ఇప్పుడు అధికారం దక్కగానే వారిని నట్టేట ముంచేసి పొమ్మంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని మహిళలను కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా వంచించారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తనను తాను ‘ఓజీ’ (OG) గా భావిస్తుంటారని, కానీ అసలు నిజానికి ఆయన ఒక ‘పెద్ద క్యాబేజీ’ అంటూ రోజా చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి.
Read Also : అమెరికా దాడిలో మెరైన్ ఇంజినీర్ సురేష్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
ఇదే క్రమంలో గతంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి ఉదంతాన్ని రోజా ప్రస్తావించారు. అప్పట్లో సుగాలి ప్రీతి పేరిట పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున రాజకీయం చేశారని, తీరా తాము అధికారంలోకి వచ్చాక ఆ బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేకపోయారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కూలీలకు ఇవ్వాల్సిన ఉపాధి హామీ డబ్బులను కూడా ఈ ప్రభుత్వం సకాలంలో ఇవ్వడం లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు కనీస న్యాయం చేయడం చేతకాని పవన్ కళ్యాణ్.. ఇటీవల తెలంగాణ రాజకీయాలు, అక్కడి పరిస్థితులపై పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత రాష్ట్రాన్ని గాలికొదిలేసి పక్క రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటూ మాట్లాడుతున్నారంటూ రోజా తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. రోజా చేసిన ఈ ఘాటు కామెంట్స్ పై జనసేన మరియు కూటమి శ్రేణులు ఎలా స్పందిస్తాయోనన్న చర్చ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది.
Modi – Rahul : రాజీపడిన మోడీ.. భరతమాత బిడ్డలను కాపాడలేరు – రాహుల్ విమర్శలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Janasena : జనసేన భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా పవన్ ఆలోచన
YCP : మంత్రి సవితపై YCP నేత ఉషశ్రీ చరణ్ తీవ్ర విమర్శలు
Kalyandurg news: ఓటర్ల నమోదులో తప్పిదాలు వద్దు: ఎమ్మెల్యే సురేంద్రబాబు
2 Years Success Meet in Tirupati : స్వర్ణాంధ్రే శ్వాసగా తమ ప్రభుత్వం పాలన : చంద్రబాబు
Tirupati trains: తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లు రద్దు!
AP Politics: తిరుపతి కూటమి సభలో అన్నీ అబద్ధాలే: షర్మిల!