
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జూన్ 12) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. సూర్య కరుప్పు (తెలుగులో వీరభద్రుడు)తో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి
చేస్తున్నాయి. వీటితో పాటే ఒక మలయాళం సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ స్టోరీ విషయానికి వస్తే.. ఇదొక పోలీస్ క్రైమ్ స్టోరీ.
ఎస్సై విజయ్ కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే హత్య జరుగుతుంది. మూడో రోజే ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ కేసు, ఆపై మరికొన్ని హత్యలు.. ఇలా నగరంలో వరుసగా క్రైమ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. మరి కొత్తగా జాయిన్ అయిన విజయ్ ఈ కేసులను ఎలా హ్యాండిల్ చేశాడు? దర్యాప్తులో విజయ్ కు ఎదురైన పరిస్థితులేంటి? అన్నదే ఈ సినిమా కథ.
ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ధృడం (Dridam). దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో దర్శకుడు మార్టిన్ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు వారికి బాగా పరిచయమైన మలయాళం హీరో షేన్ నిగమ్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు తో సహా మొత్తం ఐదు భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. వీకెండ్ లో ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారు, అందులోనూ మలయాళం సినిమా లవర్స్ కు ధృడం మూవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
జియో హాట్ స్టార్ లో ధృడం సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
Experience SI Vijay’s journey in Dridam, now streaming on JioHotstar.#JioHotstar #JioHotstarMalayalam #Thriller #Drama
— JioHotstar Malayalam (@JioHotstarMal) June 12, 2026
Every case has a secret. Every story has a twist. Watch the best crime stories on JioHotstar.#JioHotstar #JioHotstarMalayalam #Crime #Thriller #Drama
— JioHotstar Malayalam (@JioHotstarMal) June 12, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి