
Meta down | ఇంటర్నెట్ డెస్క్: మెటా సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మెటా యాప్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, మెసెంజర్, థ్రెడ్స్ యూజర్లు సేవల్లో అంతరాయం
ఎదుర్కొంటున్నారు. ఫీడ్ లోడ్ అవ్వకపోవడం, మెసేజులు వెళ్లకపోవడం, లాగిన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన యూజర్లు మెటా సేవల్లో అంతరాయం గురించి సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై మెటా ఇంకా అధికారికంగా స్పందించలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.