
ఇంటర్నెట్డెస్క్: వరుస చిత్రాలో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు అజయ్ దేవగణ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాల్ 4’. ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ
పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం ట్రైలర్ విడుదలైంది. గత చిత్రాల మాదిరిగానే ఆద్యంత వినోదాన్ని పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. రితేశ్ దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫేరీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్ నిర్మిస్తున్నారు.