
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Kavitha Praises Jagtial Mangoes Latest News: ప్రపంచవ్యాప్తంగా మామిడి పండ్ల ప్రేమికులకు ఎంతగానో ఇష్టమైన జగిత్యాల మామిడి కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉందని TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొనియాడారు.. నల్గొండ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించిన రైతు సమన్వయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యానవనల పంటల ప్రాముఖ్యతను, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతంలో పండే మామిడి రకాల విశిష్టతను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు..
టేబుల్ టాప్ వెరైటీ.. జగిత్యాల జిల్లాలోని పండే మామిడి కాయలకు.. ముఖ్యంగా టేబుల్ టాప్ వెరైటీ రకానికి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉందని కవిత గుర్తు చేశారు. ఇక్కడ పండ్ల లో ఉండే తీయని రుచితో పాటు నాణ్యత, అలాగే ఎక్కువ రోజులపాటు పాడవకుండా ఉండే నిల్వ సామర్థ్యం దీనికి దేశీ విదేశీ మార్కెట్లలో తిరుగులేని ఆదరణను తెచ్చిపెట్టాయని ఆమె వివరించారు. ఈ రకమైన పండ్లు కేవలం విక్రయాలకే కాకుండా ఎగుమతులకు కూడా ఎంతో అనుకూలమైన వని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ మామిడి పండ్లు అన్ని రకాల కంటే ఎంతో అద్భుతమైన రంగును కలిగి ఉంటాయని ఆమె తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర దక్కాలి.. అత్యంత నాణ్యమైన పంటను అందిస్తున్నప్పటికీ.. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాలని కవిత పిలుపునిచ్చారు.. రైతులు ఎంతో శ్రమచేసి పండించే మామిడి పంటకు మార్కెట్లో సరైన.. లాభసాటి గిట్టుబాటు ధర లభించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు లబ్ధి చేకూరేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతాన్ని మామిడి ఉత్పత్తిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాలని కవిత సూచించారు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లని ఏర్పాటు చేయడం ద్వారా జగిత్యాల జిల్లాను దేశంలోనే అతిపెద్ద మామిడి హబ్ గా తీర్చిదిద్దే అద్భుత అవకాశాలు ఉన్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన పెద్ద సంఖ్యలో రైతులతో పాటు ప్రజాప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.