
Pooja Hegde Selfie Controversy: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన తాజా హిందీ చిత్రం ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. డ్యాన్సింగ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై బాలీవుడ్లో మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే, సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో పూజా హెగ్డే అనుకోకుండా ఒక సోషల్ మీడియా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో పూజా హెగ్డే నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ దిగడానికి ఎంతో ఆసక్తిగా ప్రయత్నించాడు.
అయితే, పూజా అతడిని అస్సలు పట్టించుకోకుండా, కనీసం చూడకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “పూజా హెగ్డేకు అంత పొగరా?” అంటూ సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.
Read Also: Nandamuri Tejaswini: డ్యాన్స్‌తో షాకిచ్చిన బాలయ్య చిన్న కూతురు ఈ సెల్ఫీ వివాదం పెద్దదై సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, పూజా హెగ్డే తక్షణమే స్పందించి అసలు విషయంపై స్పష్టతనిచ్చింది. “సినిమా వాళ్లకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చేది ఎప్పుడూ ప్రేక్షకులే.
కొన్నిసార్లు ఈవెంట్లలో ఉండే హడావిడి పరిస్థితులు, సెక్యూరిటీ ఒత్తిడి వల్ల చుట్టుపక్కల ఉన్న అభిమానులను సరిగ్గా గమనించలేకపోవచ్చు. అంతేకానీ మాకు పొగరు ఉండి అలా చేశామని కాదు. మాకు ఎప్పుడూ అభిమానులే దేవుళ్లు. దయచేసి నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు” అని పూజా హెగ్డే వివరణ ఇచ్చింది.
సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్‌పోర్టుల్లో లేదా ఈవెంట్లలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూనే
ఉంటారు. అయితే పూజా హెగ్డే ఏమాత్రం ఇగోకు పోకుండా, చాలా సున్నితంగా స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పే ధోరణిలో మాట్లాడటంతో ఈ వివాదానికి దాదాపు తెరపడినట్లేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Rajasthan Sandstorm: రాజస్థాన్‌ను వణికించిన ఇసుక తుపాను.. ఆపై భారీ వర్షం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Dasari narayana rao: దాసరి సమాధి నిర్లక్ష్యంపై స్పందించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్
Peddi Movie Ticket Rates: ‘పెద్ది’ టికెట్ ధరల పెంపు పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
Nandamuri Tejaswini: డ్యాన్స్‌తో షాకిచ్చిన బాలయ్య చిన్న కూతురు
Joseph Vijay: ఎయిర్ హోస్టెస్‌తో తమిళనాడు సీఎం విజయ్.. ఫొటో వైరల్!
Shiva Rajkumar Comments On Upendra:ఉపేంద్ర కర్ణాటక సీఎం కావాలి.. తమిళనాడులో విజయ్ లాగే ఇక్కడా ఆదరించాలి!
Ram Charan: పెద్ది సినిమా.. ప్రధానితో భేటీపై రామ్ చరణ్ సంచలన విషయాలు!
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తాయి. కొన్ని జిల్లాల్లో భానుడి భగభగలు...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘తెలంగాణ...
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశాల...
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం “పెద్ది” విడుదలకు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు...
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మరోసారి అత్యంత...
కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి (CM) పదవికి రాజీనామా...
ఈ ఏడాది ఐపీఎల్ (IPL) సీజన్లో సరికొత్త సంచలనం, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో...
నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.