
ఇంటర్నెట్‌డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా రూపొందిన తాజా చిత్రం ‘కాలా హిరన్: ది బ్యాటల్ ఆఫ్ లెగసీ’. ఈ మూవీ
విడుదలపై సల్మాన్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా దురుద్దేశ పూర్వకంగా ఈ మూవీ రూపొందించారని ఆరోపించారు.
ప్రస్తుతం హైకోర్టులో కమర్షియల్ సూట్ విచారణ పెండింగ్‌లో ఉందని, అది తేలేంత వరకూ దర్శకుడు భరత్ శ్రీనేత్, నిర్మాత అమిత్ జానీ, జానీ ఫైర్ఫాక్స్ ఫిల్మ్స్, అక్షయ్ పాండే తదితరులు ఈ సినిమాను ప్రచారం, పంపిణీ, ఎగ్జిబిషన్, స్ట్రీమింగ్ సహా విడుదల చేయకుండా నిలుపుదల చేసేలా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. ఈ సినిమా ప్రచారానికి సంబంధించి తన పేరు ఉపయోగించకపోయినా.. పోస్టర్లు, ప్రచార చిత్రాలు అన్నీ తన ఆహార్యం, హావభావాలను పోలి ఉన్నాయని పిటిషన్ల పేర్కొన్నారు. అభిమానులు, ప్రేక్షకులు సులభంగా గుర్తించేలా ఉన్నాయని సల్మాన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ (SlumDog - 33 Temple Road).