
ఇంటర్నెట్ డెస్క్: రిషభ్ పంత్ అనగానే టెస్టుల్లో దూకుడుగా ఆడతాడు.. మిగతా ఫార్మాట్లలో ప్రభావం చూపించడనే కామెంట్లు వినిపిస్తాయి. అతడి ఆటతీరు కూడా అలానే ఉంది. కానీ, భారత మాజీ పేస్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్
పఠాన్ మాత్రం పంత్ మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలకంగా మారతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పంత్ విషయంలో బీసీసీఐ సెలక్టర్లు మరీ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు పంత్ ఎంపిక కాని విషయం తెలిసిందే. శనివారం తొలి వన్డే జరగనుంది.
‘‘వన్డేల్లో వికెట్ కీపర్‌గా ఇప్పుడు కేఎల్ రాహుల్ తొలి ఛాయిస్. అతడు ఓపెనర్‌గానూ.. ఐదు లేదా ఆరో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. అతడికి బ్యాకప్‌గా సెలక్టర్లు ఇషాన్ కిషన్‌ను తీసుకొచ్చారు. టాప్ ఆర్డర్లో అతడు బ్యాటింగ్ చేస్తాడు. షార్ట్ బంతులను కూడా చక్కగా ఆడేస్తున్నాడు. ఇది స్మార్ట్ సెలక్షన్. మూడో ఆప్షన్‌గా సంజు శాంసన్. అతడికి ఎప్పుడు అవకాశం వచ్చినా వన్డేల్లో సత్తా చాటాడు. గత టీ20 ప్రపంచ కప్‌లోనూ సంజు కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం చూశాం కదా..
ఇక రిషభ్ పంత్ విషయానికొద్దాం.. ఈ సందర్భంగా సెలక్టర్లకు నేనొక విజ్ఞప్తి చేస్తున్నా. 2027 వన్డే ప్రపంచ కప్ సెలక్షన్స్‌లో పూర్తిగా అతడిని పక్కన పెట్టొద్దు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ఫామ్ గొప్పగా లేదని తెలుసు. గతంలో ఇషాన్ కిషన్ కూడా జట్టులో నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత రాణించి మళ్లీ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సారథిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఝార్ఖండ్‌కు అందించాడు. అందుకే, అతడిని పంత్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వైట్‌బాల్ క్రికెట్లోకి పునరాగమనం చేయాలి’’ అని ఇర్ఫాన్ తెలిపాడు. పంత్ చివరిసారిగా 2024లో వన్డే మ్యాచ్ ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనా.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. గత ఐపీఎల్‌లోనూ గొప్ప ప్రదర్శన చేయలేదు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్సీని వదిలేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే కోట్లాది మంది అభిమానులు ఆనందంతో ఉప్పొంగుతున్న వేళ.. విశ్వ సాకర్ సంగ్రామం మొదలైంది. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్ల మ్యాజిక్‌లను చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఇక నెలన్నర రోజులు పండగ చేసుకోనున్నారు. మెక్సికో సిటీలో అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్ వేడుకలు ప్రారంభమయ్యాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు పాప్ సింగర్ షకీరా తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పలువురు కళాకారులు తమ ఆటపాటలు, విన్యాసాలతో అలరించారు.