
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Kane Williamson Retires News: ఆధునిక క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ మధ్యలోనే, తక్షణమే అమల్లోకి వచ్చేలా అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచారు.
ఎలాంటి ఆర్భాటాలు, ముందుగా ప్రకటించిన వీడ్కోలు పర్యటనలు లేకుండా.. తన ఆట శైలి లాగే ఎంతో నిశ్శబ్దంగా అంతర్జాతీయ రంగానికి ఆయన స్వస్తి పలికారు. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ జట్టు ఘోర పరాజయం పాలైన తర్వాతే, విలియమ్సన్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
"నేను దీని గురించి కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. న్యూజిలాండ్ తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లో నా సర్వశక్తులు ఒడ్డి ఆడాను. ఇంతకంటే తక్కువ స్థాయిలో (నాణ్యత తగ్గించి) కొనసాగడం నాకు ఇష్టం లేదు. నా సొంత నిర్ణయంతో, గౌరవంగా తప్పుకుంటున్నందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను" అని కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించారు.
'ఫ్యాబ్ ఫోర్'లో పడిన మొదటి వికెట్ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన నలుగురు ఆధునిక బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్లను కలిపి 'ఫ్యాబ్ ఫోర్' గా పిలుస్తారు. ఈ నలుగురిలో అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల (టెస్ట్, వన్డే, టీ20) నుండి పూర్తిగా వైదొలిగిన మొదటి ఆటగాడిగా విలియమ్సన్ నిలిచారు. సాంప్రదాయక క్రికెట్ సాంకేతికతకు నిదర్శనమైన విలియమ్సన్ లేని లోటును పూరించడం ప్రపంచ క్రికెట్‌కు అంత సులువు కాదు.
కివీస్ క్రికెట్లో 'స్వర్ణయుగం' ముగిసింది! 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్, 16 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో ఎన్నో రికార్డులను తిరగరాశారు. 378 అంతర్జాతీయ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తంగా 19,346 పరుగులు (బ్లాక్ క్యాప్స్ చరిత్రలోనే అత్యధికం) రాబట్టాడు. అందులో 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. 2021లో భారత్‌పై తొలి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) గెలిపించిన ఘనతకు కూడా అతనికే దక్కింది. 2016 నుండి 2024 మధ్య కాలంలో కివీస్ జట్టును రెండు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్, మూడు సెమీ-ఫైనల్స్‌కు నడిపించిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు.
తదుపరి ఇన్నింగ్స్ ఏంటి? అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్-బై చెప్పినప్పటికీ, విలియమ్సన్ వివిధ లీగ్ క్రికెట్లలో ఆటగాడిగా కొనసాగుతారు. అయితే, ఆయన భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన మలుపు భారత్‌లోనే ఉంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వ్యూహాత్మక సలహాదారుగా విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే విలియమ్సన్ లక్నో ఫ్రాంచైజీకి వ్యూహాత్మక సలహాదారుగా సంతకం చేశారు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకాతో ఆయనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ భారం తగ్గడంతో, ఇకపై లక్నో సూపర్ జెయింట్స్ (IPL)తో పాటు వారి కో-ఫ్రాంచైజీ అయిన సౌతాఫ్రికా లీగ్‌లోని 'డర్బన్ సూపర్ జెయింట్స్' (SA20) వ్యవహారాల్లోనూ విలియమ్సన్ కీలక పాత్ర పోషించనున్నారు. మైదానంలో తన బ్యాటింగ్‌తో అలరించిన ఈ మాజీ కివీస్ కెప్టెన్, ఇప్పుడు తెరవెనుక ఒక గ్లోబల్ క్రికెట్ వ్యూహకర్తగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.