
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
KTR Breaking News: 'తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మీనాక్షి నటరాజన్‌పై కోపం ఉన్నవాళ్లు బీజేపీ నాయకులు ఉప్పు అందించారు. రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'మొన్నటి వర్షానికి హైదరాబాద్ అవస్థలకు రేవంత్ నిర్ణయాలే కారణం. రేవంత్ రెడ్డికి ప్రజెంట్ నగరంపై అవగాహన లేదు. ఉన్న నగరాన్ని పట్టించుకోకుండా ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీపై ఫోకస్. ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తయితే ప్రజల ఇబ్బందులు తొలగేవి. కానీ ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఆపేశాడు' అని గుర్తుచేశారు. రెండు చెరువులు బాగు చేసి పోజులు కొడుతున్నారు. నాడు మేము 100 చెరువులు అభివృద్ధి చేశాం' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
మాకేం సంబంధం? హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'హైడ్రాను జిందా తిలిస్మాత్‌లా వాడుతున్నారు. 60 నియోజకవర్గాల్లో 'సర్', సభ్యత్వ నమోదు సమావేశాలు పూర్తి. సభ్యత్వ నమోదు యాప్ టెస్టింగ్ దశలో ఉంది. సభ్యత్వ నమోదు తర్వాత కమిటీలు, ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. మాకేం సంబంధం' అని స్పష్టం చేశారు. 'కాంగ్రెస్‌లో బ్లాక్‌షిప్ ఎవరో రేవంత్ రెడ్డి ఒట్టు వేస్తారా? మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైంది కాదు' అని ప్రకటించారు. ప్రతిదానికి సిట్ వేస్తారు కదా మీనాక్షి నటరాజన్ అంశంపైన కూడా సిట్ వేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి చెప్పి ఉంటారు.
కాంగ్రెస్ మూడో స్థానంలో 'సభ్యత్వ నమోదు సంఖ్య ముఖ్యం కాదు క్రియాశీల సభ్యులే ముఖ్యమని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ జారుడు బండపై ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. సచ్చిపోయిన బీఆర్ఎస్ అయితే తెల్లారిలేస్తే మాపై ఏడవడం ఎందుకు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీని కథం చేసి శిథిలాల కింద 'రైతు డిస్కం అని పెట్టీ మోటార్లకు మీటర్లు పెడుతారు. కేసీఆర్ ఏ డిస్కం పెట్టకుండానే 24 గంటలు కరెంట్ ఇచ్చారు. భట్టి విక్రమార్క మూడు ఇళ్లు కట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి రాజసౌధాలు కట్టుకుంటున్నాడు. 71 సార్లు ఢిల్లీకి తిరిగిన రేవంత్ రెడ్డి 71 రూపాయలు తేలేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కథం చేసి శిథిలాల కింద పెట్టడం ఖాయం అని జోష్యం చెప్పారు. 'దేశంలో వ్యవస్థలపై యువతకు ఆక్రోశం వస్తే యువతలో తిరుగుబాటు వస్తుందని తాను గతంలోనే చెప్పానని.. నేను అలా చెప్పినప్పుడు చాలా మంది నవ్వారు. ఇప్పుడు కాక్రోచ్ లాంటి పార్టీ చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న నాయకుడు శ్రీధర్ బాబు ఒక్కరే' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హిట్లర్ మాటలను సమర్ధించడం బాధాకరమని పేర్కొన్నారు. 'షబ్బీర్ అలీకి శుభాకాంక్షలు చెప్తా. పార్టీలో జరుగుతున్న నిజాలు బయటకు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పైసలతోనే పదవులు వస్తాయి' అని కేటీఆర్ వివరించారు. పేమెంట్ కోటాలోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని తెలిపారు.
ఊరుకునేది లేదు 'జూలైలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందని మాకు సమాచారం. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. 'జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. డీలిమిటేషన్లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదు' అని స్పష్టం చేశారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేసే.. ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ప్రకటించారు.