Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లోనూ మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్ పవర్ ద్వారా హైరిటర్న్స్ ఇస్తాయని వింటూనే ఉంటాం. ఇప్పటికీ చాలా ఫండ్స్ ఈ విషయాన్ని నిరూపించాయి. లాంచ్ అయిన
తొలినాళ్లలో పెద్దగా రాబడులు ఇవ్వకపోయిన 10, 15, 20 ఏళ్ల కాలంలో చూసుకుంటే మాత్రం తమ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించాయి. అదే క్రమంలో గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఏడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల సంపదను 20 రెట్లు పెంచాయి. లక్ష రూపాయల లంప్ సమ్ పెట్టుబడి పెట్టి వదిలేసిన వారికి ఇప్పుడు రూ.20 లక్షలకు పైగా వస్తుంటాయి. ఫండ్స్ ఇండియా వెల్త్ కన్వర్జేషన్ రిపోర్ట్ ప్రకారం 20 రెట్ల వరకు రిటర్న్స్ ఇచ్చిన టాప్-7 స్కీమ్స్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.నిప్పాన్ ఇండియా ఏఎంసీనిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ ( Nippon India Growth Mid Cap Fund ) గడిచిన 20 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్ల సంపదను 20 రెట్లు పెంచింది. లక్ష రూపాయల పెట్టుబడికి రూ.20 లక్షలు వస్తాయి. ఈ ఫండ్ వార్షిక రాబడి సగటున 16.1 శాతంగా ఉంది.హెచ్డీఎఫ్సీ నుంచి 2 పథకాలుహెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ( HDFC Flexi Cap Fund ) గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఇన్వెస్టర్ల సంపదను 16.8 రెట్లు పెంచింది. అంటే లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.17 లక్షల వరకు అందుతాయి. ఈ ఫండ్ సగటు వార్షిక రాబడి 15.2 శాతంగా ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ ( HDFC Large Cap Fund ) గత 20 ఏళ్ల కాలంలో 12.4 రెట్ల మేర లాభాలు అందించింది. లక్ష రూపాయలు పెడితే రూ.12 లక్షలకు పైగా వస్తాయి. ఈ ఫండ్ సగటు వార్షిక రాబడి 13.4 శాతం చొప్పున వచ్చింది.ఫ్రాంక్లిన్ ఇండియాఫ్లాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (Franklin India Flexi Cap Fund) గత 20 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్ల సంపదను 15.1 రెట్లు పెంచింది. లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.15 లక్షలకు పైగా ఉంటుంది. ఈ ఫండ్ సగటు వార్షిక రాబడి (CAGR) 14.5 శాతంగా ఉంది. అలాగే ఫ్లాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ (Franklin India Mid Cap Fund) గత ఇరవై ఏళ్లలో ఇ్వస్టర్ల డబ్బును 15 శాతం పెంచింది. ఈ స్కీమ్ సగటు వార్షిక రాబడి 14.5 శాతంగా ఉంది.ఆదిత్య బిర్లా సన్ లైఫ్ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ (Aditya Birla Sun Life Large Cap Fund) గత ఇరవై సంవత్సరాల కాలంలో ఇన్వెస్టర్ల సంపదను 13.4 రెట్లు పెంచింది. ఈ ఫండ్ సగటు వార్షిక రాబడి 13.9 శాతంగా ఉంది. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (Flexi Cap Fund) రెండు దశాబ్దాల కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని 13.4 రెట్లు పెంచింది. అలాగ ఈ ఫండ్ సగటు వార్షిక రాబడి 13.8 శాతంగా ఉంది.