
ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ.. క్రికెట్‌పై తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని సచిన్ టెండూల్కర్ మరోసారి నిరూపించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తూ క్రికెట్ ఆడాడు. ఈ సరదా వీడియోను
సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ.. క్రికెట్‌పై తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని సచిన్ టెండూల్కర్ మరోసారి నిరూపించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తూ క్రికెట్ ఆడాడు. ఈ సరదా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఎంత ఎత్తులో ఉన్నా.. నా ఆటిట్యూడ్ మాత్రం మారదు’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇది క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది.
కోడలు సానియా చందోక్ బౌలింగ్ చేయగా.. సచిన్ బ్యాటింగ్ చేశాడు. కూతురు సారా ఫీల్డింగ్ చేస్తూ సందడి చేసింది. ఈ సందర్భంగా ఒక బంతిని క్యాచ్ పట్టుకుని సరదాగా ఔట్ కోసం సారా అప్పీల్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన సచిన్.. ‘నన్ను నువ్వెప్పటికీ ఔట్ చేయలేవు..’ అని నవ్వుతూ చెప్పాడు. అంతటితో ఆగని సచిన్.. బ్యాట్‌ను తలకిందులుగా పట్టుకుని ఆడుతూ.. ‘ఇలా నేను బ్యాటింగ్ చేస్తే మాత్రమే నన్ను ఔట్ చేసేందుకు అవకాశం ఉంటుంది’ అంటూ సరదాగా సారాను ఆటపట్టించాడు. అయితే కొద్దిసేపటికే సారాకు క్యాచ్ అవకాశం వచ్చినా అది చేజారిపోయింది. కానీ వెంటనే వచ్చిన మరో అవకాశాన్ని మాత్రం ఆమె అందిపుచ్చుకుని సచిన్‌ను ఔట్ చేసింది. దీంతో ‘యే!’ అంటూ సారా సంబరాలు చేసుకోగా, సచిన్ కూడా ఓటమిని అంగీకరిస్తూ నవ్వేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్రికెట్‌కు దూరమైనా ఆట ఇంకా తన జీవితంలో భాగమేనని సచిన్ మరోసారి చాటాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కుటుంబంతో కలిసి గడిపిన ఈ సరదా క్షణాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత