
Moto G Max 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం మోటోరోలా నుంచి పవర్ఫుల్ ఫోన్ వచ్చేసింది. అదే.. మోటో జీ మ్యాక్స్ 5జీ ఫోన్.. మోటో మిడ్-రేంజ్ జీ లైనప్‌లో సరికొత్త
మోడల్‌గా కొన్ని గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌తో తీసే ఫొటోలు DSLR కెమెరా రేంజ్ ఉంటాయి.
అలాగే ఫోన్లో 200MP కెమెరా ఉంది. 2 కలర్ ఆప్షన్లలో సింగిల్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్సెట్, 8GB ర్యామ్ ఆధారంగా రన్ అవుతుంది.
మోటో జీ మ్యాక్స్‌లో 5,200mAh బ్యాటరీ ఉంది. యూఎస్బీ టైప్-సి పోర్ట్ ద్వారా 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు (Moto G Max 5G) సపోర్టు ఇస్తుంది. ఇందులో భారీ అమోల్డ్ స్క్రీన్ కూడా ఉంది. 200MP కెమెరాతో ఈ మోటోరోలా ఫోన్ బడ్జెట్ వివరాలను ఇప్పుడు చూద్దాం..
మోటో జీ మ్యాక్స్ 5జీ ధర ఎంతంటే? : 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్ మోటో జీ మ్యాక్స్ 5జీ ధర BRL2,519.10 (సుమారుగా రూ. 47వేలు) ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం మోటోరోలా బ్రెజిల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. మోటో జీ మ్యాక్స్ 5జీ అజల్ క్లారో గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మోటో జీ మ్యాక్స్ 5జీ ఫీచర్లు : ఫోటోగ్రఫీ కోసం మోటోరోలా ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ప్రత్యేకించి పవర్ఫుల్ 200MP కెమెరా సెటప్ ఉంది. ఎఫ్/1.8 అపర్చర్, 10x వరకు డిజిటల్ జూమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో వస్తుంది.
Read Also : Flipkart June Epic Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ సేల్.. రూ.15వేల నుంచి రూ. 50వేల రేంజ్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. మీ డ్రీమ్ ఫోన్ ఇదేనా?
డ్యూయల్ సిమ్ సపోర్టు : డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం 3 IP రేటింగ్‌లు (IP66 + IP68 + IP69) ఉన్నాయి. మిలిటరీ-గ్రేడ్ 810H సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఎత్తు నుంచి కింద పడేసినా పగలదు. అలాగే నీళ్లలో పడినా కూడా పాడవదు.
ఈ ఫోన్ డ్యూయల్-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. ఈ ఫోన్లో 6.8-అంగుళాల 1.5K సూపర్ హెచ్డీ (1272×2772 పిక్సెల్స్) ఎక్స్ట్రీమ్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది.
బిగ్ ర్యామ్, పవర్ఫుల్ ప్రాసెసర్ : కొత్త మోటో జీ ఫోన్ 2.5GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో 6nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 6400 చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఆర్ఎమ్ మాలి-జీ57 MC2 జీపీయూతో పాటు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. సెన్సార్లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఇ-కంపాస్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.
అద్భుతమైన బ్యాటరీ : ఈ ఫోన్లో 5200mAh బ్యాటరీ ఉంది. 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. సుమారు 183 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. అలాగే GPS, GLONASS, Galileo, QZSS, Beidou సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కొలతలు (164.58×77.37×7.38mm), మందం కేవలం 7.38mm మాత్రమే ఉంటుంది.