
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Moto G Max Price: మార్కెట్లోకి మోటరోలా కంపెనీ తమ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మోటో జి మ్యాక్స్‌ను కంపెనీ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 5000 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో కూడిన 6.8-అంగుళాల AMOLED డిస్ప్లే వంటి అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ప్రాసెసింగ్ కోసం.. కంపెనీ 8GB ర్యామ్‌తో పాటు మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మోస్ట్ పవర్ఫుల్ 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోటో జి మాక్స్ ధర వివరాలు.. మోటరోలా కంపెనీ బ్రెజిల్లో మోటో జి మ్యాక్స్‌ను లాంచ్ చేసింది. ఇది ధర రూ.46,000 వేల నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ బ్రెజిల్ అధికారక వెబ్సైట్లో అందుబాటలోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ నీలంతో పాటు గ్రాఫైట్ రంగులలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కంపెనీ దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.
మోటో జి మాక్స్ ఫీచర్స్ వివరాలు ఇవే.. మోటో జి మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల పెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 1.5K రిజల్యూషన్ (1272x2772 పిక్సెల్స్)కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది.. ఇది చాలా అద్భుతమైన డివైస్‌ను కలిగి ఉంటుంది. గరిష్టంగా 5000 నిట్స్ బ్రైట్నెస్ను కలిగి ఉందని కంపెనీ చెబుతోంది.. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్సెట్ ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది.
మోటో జి మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్లో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇది 2K రిజల్యూషన్‌లో వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇవే కాకుండా ఇందులో అద్భుతమైన కెమెరా ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి..
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇది 33W టర్బోపవర్ ఛార్జింగ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఇది 35 గంటల వరకు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. ఈ ఫోన్ IP66, IP68తో పాటు IP69 రేటింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇది MIL-STD-810H సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది NFC, డ్యూయల్ సిమ్‌తో పాటు బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో లభిస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.