
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Tecno Pova 8 Launch In India Telugu News: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో విడుదలైంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్‌లో 6.76-అంగుళాల ఫుల్ HD+ IPS డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000 mAh బ్యాటరీతో పాటు 45 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబోతున్నట్లు తెలిపింది.. ఇది గత సంవత్సరం విడుదల చేసిన టెక్నో పోవా 7 స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా అందుబాటులోకి తీసుకు వచ్చారు.
టెక్నో పోవా 8 ధరకి సంబంధించిన వివరాలు.. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా.. 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999తో అందుబాటులోకి వచ్చింది.. టెక్నో పోవా 8 మొబైల్‌ను కంపెనీ తెలుపు, నారింజతో పాటు ఆకుపచ్చ రంగులలో విడుదల చేసింది.
ఇక టెక్నో పోవా 8 స్పెసిఫికేషన్స్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 381 ppi పిక్సెల్ డెన్సిటీ, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.76-అంగుళాల ఫుల్ HD+ అద్భుతమైన డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత టెక్నో HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనికి మాలి-G610 MC2 GPUతో కూడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువవచ్చింది..
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని వెనకాలో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం దీనికి 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కంపెనీ అందించింది.. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా యూనిట్ పోర్ట్రెయిట్ మోడ్, వ్లాగ్ మోడ్, డ్యూయల్ వీడియోతో పాటు స్లో మోషన్ వంటి ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
టెక్నో పోవా 8 మొబైల్ వెనక భాగంలో అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ గేమింగ్ సమయంలో కెమెరా ప్రసెసర్కి చల్లదనం లభించేందుకు ఇందులో 14,689 చదరపు మిల్లీమీటర్ల కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 8,000 mAh బ్యాటరీతో పాలు చాలా ప్రత్యేకమైన 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల సులభంగా బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇవే కాకుండా ఇందులో మరెన్నో ప్రీమియం ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.